https://oktelugu.com/

Praneeth Rao: గుట్టు రట్టు : కేసీఆర్ గూఢాచారి అరెస్ట్

కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండి తనపై విపక్షాలు చేస్తున్న ఎత్తులు తెలుసుకునేందుకు తన బంధువు అయిన ప్రణీత్‌రావును గూఢాచారిగా పెట్టుకున్నాడు. అందరికన్నా జూనియర్‌ అయినా డీఎస్పీగా ప్రమోషన్‌ ఇప్పించుకున్నాడు. ఎస్‌ఐబీ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 14, 2024 / 10:57 AM IST

    Praneeth Rao

    Follow us on

    Praneeth Rao: గూఢాచారి.. సినిమా పేర్లు వినే ఉంటాం. ఈ పేరుతో చాలా సినిమాలే వచ్చాయి. ఇక గూఢాచారి వ్యవస్థ ప్రధానంగా దేశాల రక్షణ విషయంలో ఉంటాయి. సైనిక సలహాదారు అజిత్‌ ధోవల్‌ గతంలో భారత గూఢాచారిగా ఉన్నారు. ఆయన మారు వేశంలో కొన్ని నెలలు పాకిస్థాన్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే గూఢాచారి కేసీఆర్‌కు సంబంధించిన వ్యక్తి. అతనే ప్రణీత్‌రావు.

    అక్రమంగా ఫోన్‌ట్యాపింగ్‌..
    కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండి తనపై విపక్షాలు చేస్తున్న ఎత్తులు తెలుసుకునేందుకు తన బంధువు అయిన ప్రణీత్‌రావును గూఢాచారిగా పెట్టుకున్నాడు. అందరికన్నా జూనియర్‌ అయినా డీఎస్పీగా ప్రమోషన్‌ ఇప్పించుకున్నాడు. ఎస్‌ఐబీ బాధ్యతను ఆయనకు అప్పగించాడు. దీంతో ప్రణీత్‌రావు స్వామి భక్తిని చాటుకున్నాడు. ఎస్‌ఐబీని తన చేతుల్లో పెట్టుకుని, ఒక ప్రత్యే వింగ్‌ ఏర్పాటు చేసుకుని విపక్షాల ఫోన్లు, ట్యాపింగ్‌ చేయడం మొదలు పెట్టాడు. రేవంత్‌రెడ్డికి సబంధించిన ప్రతీ ఫోన్‌ రికార్డు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    అన్నీ ధ్వంసం..
    ఇక కేసీఆర్‌ అధికారంలో ఉండగా, పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రతీ అనుడును ఆయన ఫాలో అయ్యాడు. ఎత్తులు, పొత్తులు, అన్నీ తెలుసుకుని కేసీఆర్‌కు సమర్పించాడు. ఇక డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో అదే రోజు ప్రణీత్‌రావు సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి దాదాపు 40 హార్డ్‌ డిస్క్‌లు, ఫోక్‌ కాల్స్‌ ధ్వసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా కేసీఆర్‌కు గూఢాచారిగా వ్యవహరించాడు.

    కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..
    కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రేవంత్‌ సీఎం అయ్యాడు. దీంతో పోలీసులను బదిలీ చేశారు. ఈ క్రమంలో ప్రణీత్‌రావును డీఐజీ ఆఫీస్‌కు బదిలీ చేశారు. తర్వాత ప్రణీత్‌రవు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో రహస్యంగా విచారణ జరిపిన పోలీసులు ఆయనను మంగళవారం అరెస్ట్‌ చేశారు. విచారణకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఆధారాలు ధ్వసం చేసిన ప్రణీత్‌రావు సిట్‌ ముందు ఏం చెప్తారు అన్నది ఆసక్తిగా మారింది.