Homeఎంటర్టైన్మెంట్Sanju Samson: బాహుబలిలా సంజు.. గతాన్ని గుర్తు చేసుకున్న రోహిత్: గూస్ బంప్స్ స్టోరీ ఇదీ

Sanju Samson: బాహుబలిలా సంజు.. గతాన్ని గుర్తు చేసుకున్న రోహిత్: గూస్ బంప్స్ స్టోరీ ఇదీ

Sanju Samson: బాహుబలి-2 సినిమా చూశారా.. అందులో ఇంటర్వెల్ సీన్ లో భల్లాలదేవ కూర్చున్న సింహాసనం పైన ఉన్న ఛత్రం కింద పడుతుంది. ఆ సమయంలో అమరేంద్ర బాహుబలి ఒంటి చేత్తో ఆ ఛత్రాన్ని పట్టుకుంటాడు. ఎంతో తెగువను చూపించడంతో శివగామి అదేపనిగా కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటుంది.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

అలాంటి దృశ్యమే ఇటీవల అహ్మదాబాద్ లో ఆవిష్కృతమైంది. అహ్మదాబాద్ లో ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. టీమిండియా గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు.

మైదానంలో సింహం మాదిరిగా సంజు ఆడుతుంటే.. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చేస్తున్న రోహిత్ శర్మ ఆశ్చర్యంతో చూశాడు.. వారేవా ఏం బ్యాటింగ్ ఇది.. ఇలా కూడా ఆడతారా.. సిక్సర్లు ఇంత ఈజీగా స్టాండ్స్ అవతలకి పంపిస్తారా.. అన్నట్టుగా రోహిత్ శర్మ తన హావభావాలను ప్రదర్శించాడు. రోహిత్ శర్మ అలా చూస్తూ ఉంటే.. నేషనల్ మీడియా ఊరుకోదు కదా.. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసింది. అది కాస్త బాహుబలి సినిమాను తలపించింది.

2024లో టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. దక్షిణాఫ్రికా తో తలపడింది. ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల విరామం అనంతరం టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. నాటి మ్యాచ్ లో టీమిండియా గెలిచిన తర్వాత రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. అది ముగిసిన తర్వాత ఓ ఆటగాడితో సంభాషించాడు. ” ఈ మ్యాచ్లో నువ్వు ఆడాల్సి ఉండేది. కానీ సాధ్యం కాలేదు” అని రోహిత్ శర్మ అన్నాడు.

ఆ మాటలను సంజు సీరియస్ గా తీసుకున్నాడు . టి20 లో సరికొత్త అవతారాన్ని ఎత్తాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్లో విఫలమయ్యాడు. అతడు అలా విఫలం కావడంతో టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించినప్పటికీ
.. తుది జట్టులో లేడు. రింకు సింగ్.. అభిషేక్ శర్మ విఫలం కావడం.. సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం తో మేనేజ్మెంట్ సంజు కు స్వాగతం పలికింది. అతడు జింబాబ్వే మీద రాకెట్ వేగంతో బ్యాటింగ్ చేశాడు. అనంతరం వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై వీర విహారం చేశాడు. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు.

సంజు అలా బ్యాటింగ్ చేయడం.. టీమ్ ఇండియాను గెలిపించడం రోహిత్ కు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తగా కూడా అనిపించింది. 2024 t20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశం లభించని ఆటగాడు ఇంతటి స్థాయికి ఎదగడం పట్ల రోహిత్ శివగామి మాదిరిగానే ఆశ్చర్యంతో చూశాడు. విజేతలంతే.. ముందుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. అచ్చం సంజు శాంసన్ మాదిరిగా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version