NTR: జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే స్టార్ హీరోగా ఎదగడం. ఇక 20 సంవత్సరాల వయసులోనే స్టార్ స్టేటస్ ని అనుభవించడంతో ఎన్టీఆర్ కి ఎలాంటి స్క్రిప్ట్ లను ఎంచుకోవాలి అనే పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన సినిమాను వచ్చినట్టుగా చేస్తూ ముందుకు సాగాడు. దానివల్ల ఆయన చాలా ప్లాప్ సినిమాలను చేయాల్సి వచ్చింది.
ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు ఆయనతో ఇలాంటి సినిమాలు చేస్తాం, అలాంటి సినిమాలు చేస్తామంటు అతన్ని మభ్యపెట్టి చివరికి ఫ్లాప్ సినిమాలు చేసి అతనికి భారీ డిజాస్టర్లని అంటగట్టారు. ఇక అందులో ముఖ్యంగా మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ అయితే మొదటి స్థానం లో ఉంటాడు. ఈయనకి ఎన్టీఆర్ దగ్గరనుంచి డేట్స్ ఎలా తీసుకోవాలో బాగా తెలుసు.. ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే దాన్ని బ్రేక్ చేసే సినిమా మనం చేద్దామని చెప్పి అలాంటి ఒక కథ రాసుకొని ఎన్టీయార్ కి చెప్పి ఒప్పించి ఆయన చేత డేట్స్ తీసుకోవడం అనేది మెహర్ రమేష్(Meher Ramesh) కి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి.
పోకిరి సినిమా వచ్చిన తర్వాత దానిని బీట్ చేసే సినిమా చేద్దామని కంత్రి సినిమా స్టోరీ చెప్పి ఆ సినిమా చేశాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఇక మగధీర వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టడం తో అలాంటి సినిమా మనం కూడా ఒకటి చేద్దాం అని చెప్పి శక్తి సినిమా చేసి తనకి మరో భారీ డిజాస్టర్ ను ఇచ్చాడు.
ఇలా రెండుసార్లు ఎన్టీఆర్ ని నమ్మించి ఆయన దగ్గర డేట్స్ తీసుకొని ఆయన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాడనే చెప్పాలి. ఇక ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఎవరు ఎంత చెప్పిన వినకుండా తనకు నచ్చిన స్టోరీ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్లతో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అందులో భాగంగానే టెంపర్ నుంచి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా లేకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు…