https://oktelugu.com/

NTR: బాలయ్య హిట్ సినిమాను రీమేక్ చేయనున్న ఎన్టీయార్…ఆ సినిమా ఏంటంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తే చూడాలని ఉంది అంటూ మరికొంత మంది నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదిక గా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Written By: , Updated On : March 14, 2024 / 10:43 AM IST
NTR to remake Balayya hit movie

NTR to remake Balayya hit movie

Follow us on

NTR: నందమూరి నటసింహంగా పేరు పొందిన బాలకృష్ణ ఇండస్ట్రీలో తనదైన మార్క్ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తండ్రి కి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అయితే ఒకప్పుడు బాలయ్య చేసిన వైవిధ్యమైన సినిమాలను ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎవరైనా చేయగలరా అనే డౌట్ కొందరిలో నెలకొనగా, ఒకప్పుడు బాలకృష్ణ చేసిన భైరవద్వీపం సినిమాని ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తే చూడాలని ఉంది అంటూ మరికొంత మంది నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదిక గా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో ఎన్టీఆర్ ఈ సినిమాను చేసే అవకాశాలు అయితే లేవు.

ఎందుకంటే ప్రస్తుతం ఆయన వరుసగా కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ భైరవ ద్వీపం అనేది ఒక డిఫరెంట్ అటెంప్ట్ కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ కూడా కావాలి. అలాంటి దర్శకుడు దొరికినప్పుడు ఈ సినిమాని తప్పకుండా ఎన్టీయార్ రీమేక్ చేస్తాడు అని అతని సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే బాలయ్య బాబుకి, ఎన్టీఆర్ కి మధ్య కొన్ని తగాదాలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలో భైరవద్వీపం సినిమాని ఎన్టీఆర్ రీమేక్ చేస్తే బాగుంటుందంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారాలు చేయడం బాలకృష్ణ కి నచ్చడం లేదట.

కానీ అభిమానుల ఇష్టాన్ని కాదనలేక తను కూడా కామ్ గా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఫ్యూచర్ లో అయిన ఎన్టీఆర్ దీనిని సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసి బాలకృష్ణకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడా లేదా అని మరి కొంతమంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సక్సెస్ ఫుల్ సినిమాను డీల్ చేయగలిగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది…