Pushpa Famous Dialogue Copy Controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప'(Pushpa movie) సిరీస్ కి దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయిన క్యారెక్టర్ ‘పుష్ప’. అందుకే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ చిత్రం లోని ఐకానిక్ డైలాగ్స్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ‘పుష్ప 1’ ఇంటర్వెల్ లో ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ..ఫైర్’ అంటూ చెప్పిన డైలాగ్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ డైలాగ్ నా నుండి కాపీ కొట్టారు అంటూ మంచు మోహన్ బాబు తనయురాలు , మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
ఆమె మాట్లాడుతూ ‘ఫ్లవర్ అనుకున్నావా , ఫైర్ అనే పాపులర్ డైలాగ్ నా నుండే కాపీ కొట్టారు. కావాలంటే నా పాత ఇంటర్వ్యూ వీడియోలు చెక్ చేసుకోండి ‘ఆ అంటూ చెప్పుకొచ్చింది మంచి లక్ష్మి. ఇది నిజమో కాదో నెటిజెన్స్ వెతికి చూడగా, నిజంగానే ఆమె ఆ డైలాగ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పి ఉన్నది. ఆమె మాట్లాడిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి. దీంతో సోషల్ మీడియా లో ఈ అంశంపై ట్రోల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా లో ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతూ ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, స్టార్ హీరోలకు సంబంధించిన అభిమానులు ఇలాంటి వీడియోస్ బయటకు వచ్చినప్పుడు ఏకిపారేస్తూ ఉంటారు, ఇప్పుడు మంచు లక్ష్మి చెప్పిన మాటలను తీసుకొని పవన్ కళ్యాణ్ , ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
ఇక మంచు లక్ష్మి సినిమాల విషయానికి వస్తే, లేటెస్ట్ గా ఈమె ‘లేచింది మహిళా లోకం ‘ అనే చిత్రం లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిన్న ఆమె పాల్గొనగా, పై విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక ‘లేచింది మహిళా లోకం ‘ సినిమా విషయానికి వస్తే, ఇందులో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, అనన్య నాగేళ్ల, శ్రద్దా దాస్ , హరితేజ వంటి వారు కీలక పాత్రలు పోషించింది. ఇందులో మంచు లక్ష్మి లాయర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం ఈ నెల 26 న థియేటర్స్ లోకి రాబోతుంది.
