https://oktelugu.com/

Telangana Assembly Session: అర్ధగంటలో 5 సార్లు..అదీ అసెంబ్లీలోనే.. ఇదీ తెలంగాణలో దుస్థితి..

రాష్ట్రానికి కోవెలగా చెప్పుకునే అసెంబ్లీలో కరెంట్ కష్టాలు తప్పడం లేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ఎల్పీలో కూర్చున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతుండగా.. అరగంలో ఐదు సార్లు కరెంట్ పోవడంపై పాడి మండిపడ్డారు. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియా..

Written By:
  • Mahi
  • , Updated On : December 16, 2024 / 05:24 PM IST

    Telangana Assembly Session

    Follow us on

    Telangana Assembly Session: కేంద్రానికి పార్లమెంట్, రాష్ట్రానికి అసెంబ్లీ చాలా ముఖ్యమైనవి కదా..? అక్కడ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. ప్రజా ప్రతినిధులు కూర్చొని దేశ, రాష్ట్ర భవిష్యత్ డిసైడ్ చేసేది అక్కడే. అందుకే ప్రజా స్వామ్య దేశంలో వాటిని దేవాలయాలుగా చెప్తారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పథకాలు, ఇంకా.. చాలా విషయాలపై ప్రతిపక్షం పాలకపక్షం మధ్య చర్చ నడుస్తుంది. అయితే అక్కడ పరిస్థితులు దిగజారితే ఆ ప్రభుత్వం పురువు పోతుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, పెద్దలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఉన్నారు. అయితే అక్కడ కరెంట్ సమస్య తీవ్రంగా వేధిస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ‘అసెంబ్లీలో సమావేశాల రోజు ఉదయం 8.30 గంటలకు బీఆర్ఎస్ఎల్పీలో కరెంట్ పోయింది. ఏదో ఒక్కసారి పోయి రావడం కాదు.. అర్ధగంటలో ఏకంగా 5 సార్లు పవర్ వస్తుంది.. పోతుంది. రాష్ట్రానికి కోవెల అయిన అసెంబ్లీలో ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటని సందేహం కలుగుతుంది’ అని అన్నారు.

    ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో ఉండగానే వీడియో తీసి సోషల్ మీడియాలోని తన ఇన్ స్టా ఖాతా ద్వారా బయటకు పంపారు. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గత పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇలానే కరెంట్ కోతలు ఉండేవి. ఒక్క అసెంబ్లీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉండనే ఉన్నాయి. అప్పడు నార్త్ సౌత్ గ్రిడ్లు వేర్వేరుగా ఉండడంతో పవర్ కట్ కామనే.. కానీ ఇప్పుడు అవి కలిపారు. అంటే పవర్ కట్ అనేది లేనే లేదు.

    కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది కామనే అన్నట్లుగా ఉంటోంది. రేవంత్ పాలన పూర్తయి ఏడాది గడిచింది. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సరే నెరవేర్చిన వాటిలో ఏవీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. (ఒక్క ఫ్రీ బస్) తప్ప. ఈ కారణంతో ప్రజలు ఏడాది పాలనపై గుర్రుగా ఉన్నారు.

    రేవంత్ ఇప్పటికీ పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేయలేదు. విద్యా శాఖ మంత్రి పోస్ట్ ఖాళీగానే ఉంది. దీంతో గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ కేసులు రోజుకు ఒక్కచోటైనా కనిపిస్తుంది. అన్నెం పున్నెం ఎరుగని విద్యార్థులు రేవంత్ పాలనలో కన్నీటి పర్యంతమవుతున్నారు. వీటిపై ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నాయి. ఫుడ్ పాయిజన్ విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, విద్యా శాఖను తన వద్ద ఉంచుకొని లాభం ఏంటని బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంది.