Mahesh Babu: మన టాలీవుడ్ లో స్క్రిప్ట్ సెలక్షన్ లో తోపు ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన మొదటి సినిమా నుండి ఒకసారి పరిశీలిస్తే అప్పటి జనరేషన్ కి చాలా అప్డేట్ గా ఉండే ఆలోచనలతో సినిమాలు చేసేవాడు. ప్రతీ చిత్రం తోనూ ఆయన ఒక సరికొత్త ప్రయోగం చేసి చూపించేవాడు. కమర్షియల్ జానర్ లో కూడా ఆయన ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించేలా సినిమాలు చేసేవాడు.అలా చేస్తే వచ్చినవే ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి అద్భుతమైన సినిమాలు. ఫ్లాప్ సినిమాలు సైతం మహేష్ బాబు వి చూసేందుకు చాలా గొప్పగా ఉంటాయి. ఉదాహరణకి ఆయన ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రం అప్పట్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఆరోజుల్లోనే ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆడియన్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ సినిమాని తీసాడు.
అదే సినిమా ఇప్పుడు విడుదల అయ్యుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించేది. అయితే ఇలాంటి సినిమాలు తీసి ఎక్కువ శాతం మహేష్ బాబు ఫెయిల్యూర్స్ ని ఎదురుకోవడం వల్ల ఆయన కమర్షియల్ గా సేఫ్ గా ఉండే సినిమాలనే చూస్తున్నాడు. అవి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి కూడా. కానీ ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ బాబు సినిమాలు డబ్బులు రాబట్టలేకపోతున్నాయి. ఇది ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశకి గురి చేసిన విషయం. వాస్తవానికి ‘రంగస్థలం’ చిత్రం తర్వాత డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబు వద్దకు ‘పుష్ప’ మూవీ స్టోరీ తో వెళ్ళాడు. ఈ స్టోరీ ని విన్న మహేష్ బాబు, ఇది నా బాడీ లాంగ్వేజ్ కి వర్కౌట్ అవ్వదు, వేరే కథతో నా దగ్గరకి రా అని అన్నాడట.
కానీ సుకుమార్ అప్పటికే పుష్ప కథకి మాత్రమే స్టిక్ అయ్యాడు. తన దగ్గర ఈ స్టోరీ ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్, వెంటనే సుకుమార్ కి ఫోన్ చేసి తనతో ఈ ప్రాజెక్ట్ చేయమని అడిగాడట. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లి, ఇంతటి అద్భుతాలను నెలకొల్పింది. అలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పుష్ప సిరీస్ రెండు భాగాలకు కలిపి 2000 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. అంతటి క్రేజీ కలెక్షన్స్ ని చూసే అదృష్టం మహేష్ బాబు కోల్పోయాడని, ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్ కి ఆయన దూరం అవుతున్నాడని, రాజమౌళి సినిమాతో అయినా మరోసారి మహేష్ బాబు తన సత్తా చూపించాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా మహేష్ ని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు.