https://oktelugu.com/

Manchu Manoj: మోహన్ బాబును ఢీ కొట్టేందుకేనా మనోజ్ రాజకీయ అరంగేట్రం? కాక రేపుతున్న మంచు వారి ఆధిపత్య పోరు

మంచు ఫ్యామిలీ లో రగిలిన కుంపటి ఇప్పట్లో ఆరే సూచనలు కనిపించడం లేదు. మోహన్ బాబును ఢీ కొట్టేందుకు మనోజ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారట. ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారన్న న్యూస్ కాకరేపుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 16, 2024 / 05:55 PM IST

    Manoj

    Follow us on

    Manoj: మంచు మనోజ్-మోహన్ బాబు మధ్య వైరం తారా స్థాయికి చేరింది. బద్ధ శత్రువుల మాదిరి తండ్రీ కొడుకులు కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే భౌతిక దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. మంచు మనోజ్ ని మోహన్ బాబు ఇంటి నుండి వెళ్ళిపో అంటూ తరిమే ప్రయత్నం చేశాడు. శంషాబాద్ సమీపంలోని మంచు ఫ్యామిలీకి చెందిన జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద మూడు రోజులు హైడ్రామా నడిచింది. ఇరు వర్గాలు ప్రైవేట్ సెక్యూరిటీని దించాయి. మనోజ్ గన్ మెన్ ని కూడా తెచ్చుకున్నాడు.

    మోహన్ బాబు-మనోజ్ ల వివాదం ఏ క్షణంలో తీవ్ర రూపం దాల్చుతుందో అన్న టెన్షన్ నెలకొంది. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. మంచు మనోజ్, విష్ణు, మోహన్ బాబులకు రాచకొండ కమీషనర్ వార్నింగ్ ఇచ్చాడు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని సూచనలు చేశారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో అటు మోహన్ బాబు మీద మరో కేసు నమోదైంది.

    మోహన్ బాబుతో మనోజ్ కి ఎక్కడ చెడింది అనే విషయంలో పలు ఊహాగానాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల వద్దే మనస్పర్థలు తలెత్తాయనే ఓ వాదన ఉంది. మనోజ్ మాత్రం నా పోరాటం ఆస్తి కోసం కాదు, నా ఫ్యామిలీ భద్రత కొరకు అంటున్నారు. అలాగే మోహన్ బాబు, విష్ణు నడుపుతున్న శ్రీ విద్య నికేతన్ విద్యాసంస్థల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మోసపోయిన విద్యార్థులకు నేను అండగా ఉంటానని ప్రకటించారు.

    ఆర్థికంగా బలంగా ఉన్న మోహన్ బాబు, విష్ణులను ఢీ కొట్టాలంటే అధికార పార్టీ అందండలు అవసరమని మనోజ్ నమ్ముతున్నాడని సమాచారం. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న మనోజ్ అధికారిక ప్రకటన చేయనున్నారట. ఆయన భారీ ర్యాలీగా వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవనున్నారట. జనసేన కండువా కప్పుకోనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ తరచుగా పార్టీలు మారుతూ ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.