Akhanda 2 New Release Date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన నాల్గవ చిత్రం ‘అఖండ 2′(Akhanda 2 Movie), అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే నేడు విడుదల అయ్యుండేది. కానీ నిర్మాత పాత అప్పులు క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉండగా, హై కోర్టు లో కేసు వేయడం తో ఈ సినిమాని ఆపివేయాలంటూ స్తే ఆర్డర్ వచ్చింది. దీంతో నేడు విడుదల కావాల్సిన ఈ సినిమాని అర్థాంతరం గా ఆపేసారు. ఇప్పటికీ ఉన్న సమస్యలు తీరాయా లేదా అనే దానిపై స్పష్టమైన క్లారిటీ రాలేదు. మరోవైపు అభిమానులు ఆలస్యం అయినా నేటి రాత్రి నుండి షోస్ పడుతాయని అనుకున్నారు. కానీ అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మేకర్స్ కొత్త విడుదల తేదీ కోసం చూస్తున్నారని లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి మేకర్స్ ఆలోచన లో రెండు విడుదల తేదీలు ఉన్నాయట.
ఒకటి డిసెంబర్ 12 అయితే మరొకటి డిసెంబర్ 19 . తమ బయ్యర్స్ తో చర్చలు జరిపిన తర్వాత డిసెంబర్ 19 న విడుదల చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ అదే రోజున ‘అవతార్ 3’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో , ఇండియా లో కూడా అంతే క్రేజ్ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో సినిమాకు ఉన్నంత బజ్ ఈ చిత్రానికి ఉంది. అందుకే అఖండ 2 కి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని మరోవైపు నుండి ఆలోచిస్తున్నారట. ఈరోజు, రేపు లోపల విడుదల తేదీ విషయం లో స్పష్టమైన క్లారిటీ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రోజున , లేదా సోమవారం రోజున కొత్త విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు ట్రైలర్స్ ని విడుదల చేశారు. ఇప్పుడు సరికొత్త డేట్ కోసం మరో ట్రైలర్ ని విడుదల చేసే అవకాశాలు లేవు. కాబట్టి ఉన్న ప్రొమోషన్స్ తోనే సరిపెట్టుకోవాలి. ఇప్పటికే బాలయ్య, బోయపాటి శ్రీను తెలుగు , హిందీ , తమిళం అని తేడా లేకుండా అన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూస్ గట్టిగా ఇచ్చేసారు. మళ్లీ వీళ్లిద్దరు ఫ్రెష్ గా ప్రొమోషన్స్ ని మొదలు పెడుతారో లేదో చూడాలి. నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఏ మేరకు వాళ్ళ అంచనాలను చేరుకుంటుందో చూద్దాం.