Pothireddypadu Lift Irrigation Project: సాధారణంగా ఏపీ అంటే గులాబీ పార్టీకి నచ్చదు. అలా నచ్చితే ఆ పార్టీకి సెంటిమెంట్ వర్కౌట్ కాదు. అదే సమయంలో టిడిపి( Telugu Desam Party) అన్న ఆ పార్టీకి పడదు. పడితే మళ్లీ తెలంగాణలో టిడిపి బతికేస్తుంది. అందుకే ఏపీతోపాటు టిడిపిని విపరీతంగా ద్వేషిస్తుంటారు గులాబీ నేతలు. ఈ అంశంపై నైనా మాట్లాడాలి అంటే అది ముందుగా చంద్రబాబు గురించి అయి ఉంటుంది. అంతలా అక్కడ విద్వేషం రెచ్చగొడితే గాని పని జరగదు. అటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చెప్పింది కరెక్ట్ అని చెబుతోంది. ఏపీ ప్రభుత్వం చెప్పినదానితో ఏకీభవిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏపీ ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాయలసీమలో నిర్మించ తలపెట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి తానే నిలుపుదల చేయించానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై మూడు పార్టీల నుంచి అభిప్రాయాలు వచ్చాయి. ముందుగా ఏపీ ప్రభుత్వం ఇది తప్పు అని.. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో నిజం లేదని తేల్చేసింది. గులాబీ పార్టీ సైతం ఏపీ ప్రభుత్వం చెప్పిందే నిజం అని పేరు చేసింది. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో చంద్రబాబు చీకటి ఒప్పందం అని ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది.
Also Read: నిండు సభలో కవిత కన్నీరు..
అనుమతులు తీసుకోకుండానే..
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు( Pothireddy Padu project) అనేది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నది వరద నీటిని తరలించేందుకు నిర్మించ తలపెట్టినది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులకు మళ్ళించే ముఖ్యమైన నీటి నియంత్రణ వ్యవస్థ. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఏ అనుమతులు తీసుకోలేదు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తో పాటు కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో 2020లోనే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. జగన్ ఈ ప్రాజెక్టు ప్రతిపాదన చేసిన సమయంలోనే తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బిఆర్ఎస్, విపక్షంలో ఉన్న కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాలకు.. తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ కు లబ్ధి చేకూర్చే విధంగా.. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, చిత్తశుద్ధి లేకుండా ఈ పథకాన్ని ప్రారంభించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 2020 తోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం అలానే ఉండిపోయింది.
Also Read: తెలంగాణ సీఎం వస్తే ఒకరు.. డిప్యూటీ సీఎం వస్తే మరొకరు.. అంత కన్ఫ్యూజన్!
అంతా రాజకీయ లబ్ధి కోసమే..
అయితే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఈ ప్రస్తావన తెచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల ఆయన ప్రతి వివాదంలోనూ చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారు. అయితే తన హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయిందన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ తన సొంత మీడియాలో మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం అంటూ పతాక శీర్షికన కథనాలు రాయిస్తున్నారు. అదే సమయంలో బిఆర్ఎస్ నేతలు.. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చెప్పడం లేదు. అసలు జగన్ ప్రస్తావన తేవడం లేదు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిలిచిపోయింది అని చెబితే తన మిత్రుడికి పొలిటికల్ డామేజ్ జరుగుతుంది. అన్నింటికీ మించి చంద్రబాబు ప్రస్తావన ఉండదు. అందుకే మధ్య మార్గంలో ఏపీ సర్కార్ అభిప్రాయంతో ఏకీభవిస్తోంది గులాబీ పార్టీ. అయితే అసలు చంద్రబాబుకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేక నిలిపివేసిన ప్రాజెక్టు అది. కానీ అనవసరంగా చంద్రబాబు పేరు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. తాను ఆపిన ప్రాజెక్టు నిర్మాణం శాపాన్ని చంద్రబాబు పై నెట్టేse ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అసలు టిడిపి, చంద్రబాబు గాలిపడని గులాబీ పార్టీ సైతం జగన్కు నష్టం లేకుండా ఆయన పేరు ప్రస్తావించడం లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అన్ని చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి.