Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Vara Prasad Garu Closing Collections: 'మన శంకర్ వర ప్రసాద్' క్లోజింగ్...

Mana Shankara Vara Prasad Garu Closing Collections: ‘మన శంకర్ వర ప్రసాద్’ క్లోజింగ్ కలెక్షన్స్ అంతేనా..?అంటే ఇంతకు ముందు చెప్పినవన్నీ ఫేకా..?

Mana Shankara Vara Prasad Garu Closing Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మన తెలుగు హీరోలు స్టార్ స్టేటస్ ని చూపిస్తూ భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు…గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా సంక్రాంతి కానుక వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ […]

Mana Shankara Vara Prasad Garu Closing Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మన తెలుగు హీరోలు స్టార్ స్టేటస్ ని చూపిస్తూ భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు…గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా సంక్రాంతి కానుక వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా 109 కేంద్రాల్లో 50 రోజుల్లో పూర్తి చేసుకుంది.

ఈ మూవీ 330 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అని మొదట్లో చాలామంది చాలా రకాల కామెంట్లు చేసినప్పటికి మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో దర్శకుడు కీలక పాత్ర వహించాడు.

చిరంజీవిని ఎలా చూపిస్తే అతని అభిమానులు సంతృప్తి చెందుతారో అలాంటి ఒక క్యారెక్టర్ లో చిరంజీవిని చూపించడం అనేది మామూలు విషయం కాదు… గతంలో ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ వచ్చాయని చెప్పినప్పటికి అదంతా ఫేక్ గా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి 330 కోట్ల వరకు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయట. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి 300 కోట్ల క్లబ్లో చేరిపోయాడు అంటు అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే సినిమాలతో ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడమే కాకుండా రికార్డులు బ్రేక్ అయ్యే విధంగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి 500 కోట్ల మార్క్ ను అందుకోవడమే చిరంజీవి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడట… బాబీ సినిమా కూడా చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా తెరకెక్కబోతుందట…కాబట్టి ఈ సినిమా 500 కోట్ల మార్క్ దాటిందని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper