Google pixel 10: 2026 కొత్త సంవత్సరం సందర్భంగా అప్డేట్ అయిన మొబైల్స్ కోసం చూసేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పటికే చాలా కంపెనీలు కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అయితే కొంతమంది ఖరీదైన మొబైల్స్ కొనాలని చూస్తారు. ఇలాంటివారు ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ వంటి ప్రీమియం మొబైల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాదిలో Google Pixel 10 కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కు మించిన ఫీచర్స్ తో పాటు.. శక్తివంతమైన బ్యాటరీ, నాణ్యమైన కెమెరా అందించే మరికొన్ని ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ కిందికి వెళ్ళండి..
iphone 17.. గూగుల్ పిక్సెల్ 10 కొనాలని చూసేవారు దానికి ప్రత్యామ్నాయంగా ఐఫోన్ 17 ను కొనుగోలు చేయవచ్చు. ఇది 6.3 అంగుళాల LTPO XDR OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేటు తో పనిచేస్తూ 3000 nits బ్రైట్ నెస్ తో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో బలమైన బ్యాటరీని అమర్చారు. డాల్బీ విజన్ HDR తోపాటు డ్యూయల్ 48 MP కెమెరాలను అందించే ఈ ఫోన్ నేటి యూత్ కు కచ్చితంగా నచ్చుతుందని చెబుతున్నారు. దీనిని రూ.82,000 తో విక్రయిస్తున్నారు.
Samsung నుంచి గెలాక్సీ ఎస్ 25 మొబైల్ కూడా ప్రీమియం ఫోన్ కొనాలని చూసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో 6.2 అంగుళాల డైనమిక్ AMOLED బ్యాటరీని అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. అలాగే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ ద్వారా 50 MP కెమెరా సెట్ అప్ పనిచేస్తుంది. ఇది మార్కెట్లో రూ 69,900 ధరతో అందుబాటులో ఉంది.
Oneplus కంపెనీ నుంచి 15 మొబైల్ కూడా యూత్ నువ్వు బాగా ఆకర్షిస్తుంది. ఇందులో లతో AMOLED డిస్ప్లే తోపాటు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ నువ్వు అమర్చారు. అలాగే ఇందులో 50 MP కెమెరా ఉండడంతో ఫోటోగ్రఫీ వారికి అనుగుణంగా ఉంటుంది. స్మూత్ నెస్ స్క్రోలింగ్ తో పాటు 8k వీడియో అందించే ఈ మొబైల్ ను రూ.72,999 తో విక్రయిస్తున్నారు. ఇది గూగుల్ పిక్సెల్ 10 ను అధిగమించే విధంగా ఉంటుంది.
చైనా కంపెనీ Vivo నుంచి X300 అనే మొబైల్ ప్రీమియం వినియోగదారులకు సపోర్టు ఇస్తుంది. ఇందులో 6.31 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను అమర్చారు. అలాగే 200 MP కెమెరా ఉండనుంది. ఇది 9500 dimencity తో పని చేయడం వల్ల కావలసిన ఫోటోలను పొందవచ్చు దీనిని మార్కెట్లో రూ.72,999 తో విక్రయిస్తున్నారు.
iQOO అనే కంపెనీ నుంచి 15 మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇందులో LTPO AMOLED డిస్ప్లేను అమర్చారు. అలాగే స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్లు కలిగి ఉండడంతో ఫాస్టెస్ట్ మూవింగ్ ఉంటుంది. దీనిని మార్కెట్లో రూ.72,999 తో విక్రయిస్తున్నారు.