MLC Kavitha : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు, ఎమ్మెల్సీ కవిత సోమవారం తెలంగాణ శాసన మండలిలో రాజీనామా ఆమోదానికి ముందు ప్రసగించే అవకాశం ఇవ్వాలని చైర్మన్‌ను కోరారు. అవకాశం ఇవ్వండంతో 12 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌లో తనపై జరిగిన కుట్రలు, రాష్ట్రంలో జరిగిన అవినీతిని బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వలేదని, బీఆర్‌ఎస్‌కు నైతికత లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమో కన్నీరు పెట్టుకున్నారు.
ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు
తెలంగాణ పోరాటకారులకు సరైన గుర్తింపు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను 8 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా జాగృతి కార్యక్రమాలు నడిపానని, కానీ అవి అడ్డుకున్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పడిన తక్కువ కాలంలోనే తమపై కుట్రలు చేశారని, తనను అణచివేయడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు.
పార్టీలో అంతరాయాలు, అక్రమాలు..
బీఆర్‌ఎస్ అధికార హయాంలో కొందరు కీలక వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నారని కవిత వివరించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోవడం, అంతర్గత సమావేశాల్లో ప్రశ్నలు చేస్తే దెబ్బలు తిన్నట్టు చెప్పారు. పార్టీ పేరు మార్పును వ్యతిరేకించడం, ఢిల్లీ లిక్కర్ కేసుతో బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్థూపం వరకు అవినీతి, అక్రమాలు జరిగాయని, పార్టీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు.
ఆత్మగౌరవం, నైతికత సమస్యలు..
బీఆర్‌ఎస్‌లో నైతికత లేదని కవిత అన్నారు. తెలంగాణ ద్రోహులకు మద్దతు ఇవ్వడం తప్పనిసరిగా ఉందని కవిత ఎద్దేశారు. పార్టీ తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, ఆత్మగౌరవం కోసం పార్టీని వీడానని తెలిపారు. వ్యక్తిగతంగా సభ నుంచి వెళ్తున్నాను, కానీ శక్తిగా తిరిగి వస్తానని ధైర్యంగా ప్రకటించారు.
కవిత ప్రసంగిస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నారు. ప్రసంగం తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరాలోచన చేయాలని కవితను కోరారు. కవిత అన్నీ ఆలోచించానని, రాజీనామా వెంటనే ఆమోదించాలని పట్టుబట్టారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
శాసన మండలిలో కన్నీరు పెట్టుకున్న MLC కవిత | Mlc Kavitha Crying On Legislative Council | Prime9 News#MLCKavitha #LegislativeCouncil #viralvideo #LatestNews pic.twitter.com/yHi1fU1K5D
— Prime9News (@prime9news) January 5, 2026