Political debate fight: తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజులవి. ఓ ఛానల్ లైవ్ డిబేట్ పెట్టింది. అందులో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. రాయడానికి వీలుని భాషలో తిట్టాడు. అంతేకాదు తనతో డిబేట్ చేసే వ్యక్తిని కొట్టాడు. దెబ్బతో అతడు ఓ ప్రాంతంలో హీరో అయిపోయాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా ప్రతినిధిగా గెలిచాడు. ఓ పార్టీ అధినేతకు అత్యంత దగ్గర వ్యక్తిగా మారిపోయాడు. కనివిని ఎరుగని స్థాయిలో డబ్బు సంపాదించాడు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అతని నోటి దురద తగ్గలేదు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే అతని వ్యక్తిత్వం మారలేదు. పైగా అతడిని ఆ పార్టీ గొప్ప నాయకుడిగా పేర్కొంటున్నది. విలువగల వ్యక్తిగా ఆకాశానికి ఎత్తేస్తున్నది. తెలుగు మీడియా చరిత్రలో ఆ నాయకుడి “కొట్టుడు” ఉదంతం గురించి ఇప్పటికీ కథలు కథలు గానే చెప్పుకుంటారు.
ఇక ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాలలో టీవీ చానల్స్ లో కొట్టుకున్న సంఘటనలు కూడా వెలుగు చూశాయి. కాకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నాయకుడు కొట్టిన తీరుగా ఏ సంఘటన కూడా నమోదు కాలేదు. వాస్తవానికి నాయకులకు డిబేట్లో చర్చించే దమ్ము లేనప్పుడు.. మాట్లాడే ధైర్యం లేనప్పుడు ఇలా చేతికి పని చెప్తారు. ఆగ్రహాన్ని దాచుకోలేక.. ఆవేశాన్ని ఆపుకోలేక ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు. ముఖ్యంగా నాలుగు స్తంభంగా వెలుగుతున్న మీడియాలో దాడులకు ఏమాత్రం ఆస్కారం లేదు. కానీ మీడియా కేంద్రాలలో దాడులు జరుగుతుండడం నాయకుల్లో పేరుకుపోతున్న లేకితనానికి నిదర్శనం. వాస్తవానికి ఆవేశాన్ని ఆపుకోలేని వారు.. ఆగ్రహాన్ని చల్లార్చుకోలేనివారు నాయకులుగా చలామణి కాలేరు. నాయకులుగా ఎదగలేరు. ఆ సమయానికి ఆ పార్టీ కార్యకర్తలకు వారు గొప్పగా కనిపించవచ్చు. కానీ వ్యక్తిత్వంలో అధమ స్థాయిలోనే ఎప్పటికీ దర్శనమిస్తారు.
Also Read: కేటీఆర్, హరీష్ పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ లో డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవని సతీష్, గులాబీ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న డిబేట్లో దేవని సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి సమాధానం చెప్పలేక ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. రాయడానికి వీల్లేని మాటలతో విమర్శించారు. అంతేకాదు ఒకసారిగా ప్రసాద్ సతీష్ మీదకి వెళ్లి దాడి చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది . దీనికి సంబంధించిన వీడియోను గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే ఓ సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది. అంతేకాదు తన పార్టీ నాయకులకు కోపం రాకుండా అత్యంత షుగర్ కోటెడ్ రాత రాసింది. దెబ్బలు తిన్న కాంగ్రెస్ నాయకుడి పేరు ప్రస్తావించిన ఆ సోషల్ మీడియా హ్యాండిల్.. దెబ్బ కొట్టిన గులాబీ పార్టీ నాయకుడి పేరును మాత్రమే ప్రస్తావించింది. అతని పార్టీ పేరును మాత్రం పేర్కొనలేదు. అయితే ఈ దాడిని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తున్నారు.. చర్చించే దమ్ము లేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా దాడులకు దిగితే గులాబీ పార్టీ కార్యకర్తలు రోడ్డుమీదికి కూడా రాలేరని హెచ్చరిస్తున్నారు..” టాపిక్ మీద మాట్లాడాలి. విషయం ఉంటేనే చర్చలోకి రావాలి. అదే తప్ప ఇష్టానుసారంగా విమర్శలు చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా భౌతికదాడులకు పాల్పడకూడదు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అంటేనే విషయం లేదని అర్థం. అలాంటప్పుడు చర్చకు ఎందుకు రావాలి. ఇలా భౌతిక దాడులకు ఎందుకు పాల్పడాలి. భౌతిక దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. అంతకుమించి భౌతిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ” కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఓ టీవీ చర్చలో భాగంగా మాటామాటా పెరిగి కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ దవడ పగలగొట్టిన గౌతమ్ ప్రసాద్
Video Credits – YOYO TV pic.twitter.com/T0XjAwdNHt
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025