https://oktelugu.com/

తెలంగాణలోని ఆ జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం.. అన్నం పూర్తిగా మాడిపోవడంతో..?

తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం బయటపడింది. ఈ బియ్యంతో వండిన అన్నం పూర్తిగా మాడిపోవడంతో గ్రామస్తులు ప్లాస్టిక్ బియ్యమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పూలాజి బాబా ఆశ్రమం దగ్గర జరిగిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు వండిన అన్నం ప్లాస్టిక్ బియ్యంతో వండినదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బియ్యాన్ని అధికారులు పరీక్షించి ప్లాస్టిక్ బియ్యమో కాదో నిర్ధారించాల్సి ఉంది. అయితే అప్పటికే ప్లాస్టిక్ బియ్యంతో వండిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 1, 2021 / 12:32 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం బయటపడింది. ఈ బియ్యంతో వండిన అన్నం పూర్తిగా మాడిపోవడంతో గ్రామస్తులు ప్లాస్టిక్ బియ్యమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పూలాజి బాబా ఆశ్రమం దగ్గర జరిగిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు వండిన అన్నం ప్లాస్టిక్ బియ్యంతో వండినదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ బియ్యాన్ని అధికారులు పరీక్షించి ప్లాస్టిక్ బియ్యమో కాదో నిర్ధారించాల్సి ఉంది.

    అయితే అప్పటికే ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నాన్ని కొంతమంది తినడంతో ఈ ప్లాస్టిక్ బియ్యం వల్ల తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాళ్లు భావిస్తున్నారు. అక్కడ నివాసం ఉండే స్థానికులు ప్లాస్టిక్ బియ్యం విక్రయిస్తున్న వారిని పోలీసులు, అధికారులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొన్ని నెలల క్రితం అదిలాబాద్ జిల్లాలోని ఒక రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చిన సంగతి తెలిసిందే.

    బియ్యం నల్లబడటానికి గల కారణం తేల్చాలని.. ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవాళ్లను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ప్లాస్టిక్ రైస్ కు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    చాలామంది ఈ ప్లాస్టిక్ రైస్ ను చైనా ప్లాస్టిక్ రైస్ అని పిలుస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్లాస్టిక్ రైస్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పాడైపోయిన బియ్యాన్ని పాలిషింగ్‌ చేసి అమ్మినా నల్లబడే అవకాశం ఉండటంతో ఈ బియ్యం పాడైపోయిన బియ్యమని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.