https://oktelugu.com/

సమయం లేదు.. ఇక తాడో పేడో.. అమిత్ షాతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

తిరుపతి ఉప ఎన్నిక గడువు దగ్గర పడుతోంది. వచ్చే నెల ఆరవ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికకు ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధం అయ్యారు. అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. అధికార వైసీపీ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గెలువు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తిరుపతిలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇతర నేతలతో సమీక్ష […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 1, 2021 12:32 pm
    Follow us on

    Pawan Kalyan Amit Shah
    తిరుపతి ఉప ఎన్నిక గడువు దగ్గర పడుతోంది. వచ్చే నెల ఆరవ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికకు ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధం అయ్యారు. అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. అధికార వైసీపీ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గెలువు కోసం ఇప్పటి నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం తిరుపతిలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇతర నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.

    Also Read: వైసీపీని భయపెడుతున్న నిమ్మగడ్డ..?

    అయితే వైసీపీ, టీడీపీకు భిన్నమైన పరిస్థితి బీజేపీ దాని మిత్రపక్షం జనసేల్లో నెలకొని ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా తేలనే లేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీజేపీ ఈ ఉప ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా అనిపిస్తోంది. తిరుపతి లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బలయమైన సామాజిక వర్గాల నేతలతో భేటీ అవుతున్నారు.

    అయితే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదు. ఇది వరకు పవన్ కల్యాణ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ఒకటి రెండు సమావేశాలు కొనసాగినప్పటికీ.. దీనిపై ఎలాంటి నిర్ణయాలు ఇంకా వెలువడలేదు. ఇదే విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గతంలోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కానీ భరోనా లభించలేదు. ఫలితంగా ఎవరు పోటీ చేయాలన్న విషయంపై ఇంకా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి.

    Also Read: రేణిగుంట విమానాశ్రయంలో బైటాయించిన చంద్రబాబు.. నేలపై కూర్చొని నిరసన.. తీవ్ర ఉద్రిక్తత

    ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన అమిత్ షా తిరుపతికి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన తిరుపతి రానున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలతో భేటీ అవుతారు. తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు వపన్ కల్యాణ్ తిరుపతి వెళ్తారని సమాచారం. అభ్యర్థిని పోటీలో నిలిపే విషయంలో అమిత్ షాతో చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తాము బీజేపీకి చేసిన సాయాన్ని అధినేత చర్చించనున్నట్లు తెలిసింది. అమితా షా ఎలాంటి హామీ ఇవ్వకపోతే.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా పవన్ కల్యాణ్ సిద్ధం గా ఉన్నారని జన సైనికులు అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్