https://oktelugu.com/

నటి హిమజకు లేఖ రాసి సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్.. కారణమిదే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మంచితనంతో తోటి కళాకారులను గౌరవిస్తూ వారి మనసు దోచుకుంటున్నాడు. తనతోపాటు సినిమాల్లో నటిస్తున్న వారి పట్ల పవన్ చూపిస్తున్న అభిమానానికి ఆ నటులు ఫిదా అవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పవన్ తోటి కళాకారులను తాజాగా సత్కరిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ చారిత్రక వీరుడిది అట.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 17వ శతాబ్ధానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2021 / 12:33 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మంచితనంతో తోటి కళాకారులను గౌరవిస్తూ వారి మనసు దోచుకుంటున్నాడు. తనతోపాటు సినిమాల్లో నటిస్తున్న వారి పట్ల పవన్ చూపిస్తున్న అభిమానానికి ఆ నటులు ఫిదా అవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పవన్ తోటి కళాకారులను తాజాగా సత్కరిస్తున్నారు.

    ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఓ చారిత్రక వీరుడిది అట.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో 17వ శతాబ్ధానికి చెందిన వజ్రాల దొంగగా నటిస్తున్నాడట.. ఇందులో మొఘల్ పాలన, ఔరంగజేబు అరాచకాలు, సిక్కుల పోరాటం లాంటివి ఉన్నాయట.. దీంతో ఇది ఉత్తరాది కథ కూడా కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ ను దీనికి ఫిక్స్ చేశారు. ఇందులో హిందీ హీరో అర్జున్ రాంపాల్, హీరోయిన్ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఉండడంతో దీన్ని ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని క్రిష్ భావిస్తున్నాడట.. సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ కు నిర్మాత ఏఏం రత్నం ప్లాన్ చేశారు.

    వీరమల్లుతో పవన్ సైతం హిందీ బాటపడుతున్నాడని.. అతడు ప్యాన్ ఇండియా హీరో గుర్తింపు వస్తుందని పవన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివరాత్రికి ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

    తాజాగా ఈ సినిమాలో నటించిన పహిల్వాన్లను పవన్ కళ్యాణ్ సత్కరించారు. వారికి శాలువాలు, గిఫ్ట్ లు బహూకరించి వారి మనసు చూరగొన్నారు

    ఇక బుల్లితెర నటిగా, బిగ్ బాస్ లో మెరిసిన హిమజ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ లో సైతం పాల్గొంది. ఈ నేపథ్యంలో పవన్ తో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

    తాజాగా హిమజను పవన్ ఆశ్చర్యపరిచాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విసయాన్ని హిమజ పంచుకుంది. ‘నటి హిమజ గారికి.. మీకు అన్ని శుభాలు జరగాలని.. వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంటూ పవన్ పంపిన లేఖను షేర్ చేసింది.

    తన ఆనందాన్ని మాటల్లో లేదా ఎమోజీలతో చెప్పలేకపోతున్నానంటూ హిమజ ఆనందం వ్యక్తం చేసింది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.