Bollywood : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మన హీరోలు పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీని సైతం శాసిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోలు తమ హవాని కొనసాగించడంలో కొంతవరకు వెనుకబడిపోయారు. దాంతో మన హీరోలు పుంజుకొని మరి ముందుకు సాగుతున్నారు. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీ వెనుకబడి పోవడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది చాలా రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జాన్ అబ్రహం లాంటి నటుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో రిపోర్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను అయితే అడిగాడు.
కొంతమంది హీరోలు రోజుకు కోట్లలో పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నారట. ఇక తమ స్టైలిష్టులకు కూడా లక్షల్లో ఇవ్వాలని కోరుకుంటున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జాన్ అబ్రహం సమాధానం ఇస్తూ నిజానికి హీరోలు ఎవరు కూడా ఆ రేంజ్ లో డబ్బులను డిమాండ్ చేస్తారు అని నేను అనుకోవడం లేదు. ఇవి హీరోల మీద వస్తున్న పుకార్ల లాంటివే అంటూ ఆయన సమాధానం ఇస్తూనే ఒక రకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాలకు బడ్జెట్ లు భారీగా పెరగిపోవడమే అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read : బాలీవుడ్ కి భారీ సక్సెస్ రావాలంటే ఇదొక్కటే దారి…లేకపోతే ఇక వాళ్ళు షెడ్డుకి వెళ్ళాల్సిందే
ఇక ఈ క్రమంలోనే సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో హీరోల పారితోషకాలు కూడా భారీగా పెంచేస్తున్నారు. దీని వల్ల సినిమాకు భారీగా నష్టమైతే వాటిల్లుతుంది.దీంట్లో హీరోల తప్పేమీ లేదు కొంతమంది నిర్మాతలు హీరోలు అడిగినదాని కంటే ఎక్కువైనా ఇచ్చి సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో హీరోలు కూడా ఆ రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఈ సినిమా తర్వాత చేసే మూవీ కోసం అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తారు కానీ తక్కువ అయితే చేయలేరు కదా అందువల్లే బాలీవుడ్ ఇండస్ట్రీకి భారీగా కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆయన చెప్పాడు. ఇక ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ డౌన్ అవ్వడానికి ఓవర్ బడ్జెట్ కారణమని ఆయన చెప్పడం అందరిని ఆలోచింపజేస్తుంది…
Also Read :