Pawan Kalyan Visit Kondagattu: పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ అయిన వపన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసి 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించారు. తిరుగులేని నేతగా ఎదిగారు. ఒకవైపు సినిమాలు తీస్తూ.. ఇంకోవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ పవర్ స్టార్‌కు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న అంటే చాలా భక్తి, ఇష్టం. కొత్తగా ఏపని మొదలు పెట్టినా స్వామిని దర్శించుకుంటారు. పార్టీ కొత్తగా పెట్టిన సమయంలోనూ కొండగట్టుకు వచ్చి పూజలు చేశారు. విద్యుత్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తర్వాత వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండట్టుకు వచ్చిన తర్వాతనే ప్రచారం ప్రారంభించారు. అంజన్న దర్శించుకుని ఏ పని మొదలు పెట్టిన విజంయ సాధిస్తున్నారు. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నారు.
అభివృద్ధి చేయాలని సంకల్పించి..
ఆంజనేయస్వామి అమిత భక్తుడు అయిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలోనూ ఆలయాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపారు. కొండగట్టు సందర్శన సమయంలో అక్కడికి వచ్చే భక్తులు సరైన వసుతులు లేక ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధిలో తనవంతు కృషి చేయాలని సంకల్పించారు. భక్తి, పట్టుదలతో వసతి గదులు నిర్మించాలని నిర్ణయించారు.
96 గదులతో భవనం..
భక్తుల ఇబ్బందులను గుర్తించిన పవన్.. 96 గదులతో కూడిన భవన నిర్మాణానికి రూ.33 కోట్ల టీటీడీ నిధులతో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం (జనవరి 3న) భూమి పూజతో ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇది ఆధునిక సదుపాయాలతో భక్తులకు సౌకర్యం అందిస్తుంది. ఇది పవన్ పట్టుదలకు నిదర్శనం. ఒక్క రోజులో మార్పు సాధ్యం కాదు. కానీ, పవన్ దృష్టి, భక్తి, పట్టుదల, కృషి ఫలితం ఇది.
కొండగట్టును ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా టూరిజం కేంద్రంగా కూడా తీర్చిదిద్దేలా అభివృద్ధి పనులు, చేపట్టడంతోపాటు మౌలిక వసతులు కల్పించనున్నారు. దీంతో స్థానికుల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది రాజకీయ నాయకుడు భక్తి, పట్టుదలతో సమాజాన్ని ఎలా మార్చవచ్చో తెలియజేస్తుంది. పవన్ పట్టుదలతో ఇతర ఆలయాలు కూడా మారతాయి. భక్తి, పాలన రెండూ కలిసి పనిచేస్తేనే నిజమైన మార్పు వస్తుంది.