Best Camera Smartphone: స్మార్ట్ ఫోన్ లలో ఇప్పుడు అధునాతన కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆల్ట్రా మోడ్రన్ సెన్సార్లు, టెలిఫోటో సిస్టమ్స్, స్మార్ట్ కంప్యూటేషనల్ ఇమేజింగ్ పై దృష్టిసారించాయి. 200 మెగాపిక్సల్ సెన్సార్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాసెసింగ్, మెరుగైన ఆల్గారిదం, కలర్ సెన్స్.. వంటి వాటితో ఈ ఫోన్లు కొత్తగా కనిపిస్తున్నాయి. iPhone 17 Pro Max, Samsung galaxy S25 ultra, oppo find x9 Pro వంటి ఫోన్లలో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫోన్ స్థిరమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. రియర్ కెమెరా సిస్టంతో పనిచేస్తుంది. ఇందులో 48 మెగాపిక్సల్ ప్రైమరీ షూటర్, 48 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ సెన్సార్, 48 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 18 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇది ఫోటోలను డైనమిక్ గా ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. మనదేశంలో ఈ కంపెనీ ఫోన్ ధర 1,49,900 నుంచి లభిస్తోంది. 256 జిబి ఆన్ బోర్డు స్టోరేజ్ ఇందులో ఉంది.
Samsung galaxy s25 ultra
Samsung galaxy s25 ultra అత్యుత్తమ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా ఉంది. ఈ ఫోన్ వెనకాల నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిల్లో 2x ఇన్ సెన్సార్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కవర్ చేయగల 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది 5x ఆప్టికల్ జూమ్, ఐ ఓ ఎస్ తో 50 మెగా పిక్సెల్ టెలి ఫోటో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ తో టెన్ మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 12 మెగా మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. మనదేశంలో ఈ కంపెనీ మోడల్ ధర 1,29,999 నుంచి ప్రారంభమవుతుంది. 12gb ర్యామ్, 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఈ ఫోన్లో ఉంది.
Oppo find x9 Pro
Oppo find x9 Pro అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. జూమింగ్ లో, కలర్ సెన్స్ లో అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. ఇది 50 మెగా పిక్సెల్ సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ Samsung ISOCELL 5KJN5 ultra wide angle lens, 70 mm focal length, OIS తో 200 మెగాపిక్సల్ టెలిఫోటో సామర్థ్యం గల కెమెరా ఉంది. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ సాంసంగ్ 5KJN5 సెల్ఫీ కెమెరా ఉంది. మనదేశంలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ధర 1, 09,999 పలుకుతోంది. ఈ బ్రాండ్ టెలికాన్వర్టర్ కిట్ ధర 29,999 గా ఉంది.
Vivo x300 Pro
Oppo మాదిరిగానే వివో ఎక్స్ 300 ప్రో అత్యుత్తమమైన కెమెరా అనుభవాన్ని అందిస్తోంది. జైస్ ఆప్టిక్స్ సపోర్టుతో ఈ హ్యాండ్ సెట్ పోర్ట్రైట్, కలర్ సెన్స్ లో అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా, cipa 5.5 rating తో 50 మెగాపిక్సల్ సోనీ ఎల్ వై టి 828 సెన్సార్, కెమెరా సెట్ అప్లో 3.5 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 200 మెగాపిక్సల్ టెలిఫోటో సెన్సార్, సిఐపిఏ 5.5 రేటింగ్, 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ జే ఎన్ వన్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. భారతదేశంలో దీని ధర 1, 09,999గా ఉంది. వివోలో టీమీ టెలీ ఫోటో ఎక్స్ టెండర్ కిట్ కూడా లభిస్తుంది. దీని ధర 18,999 గా ఉంది.
Xiaomi 15 ultra
Xiaomi 17 ultra ను కూడా విడుదల చేసినప్పటికీ.. ఇది కేవలం చైనా మార్కెట్ కు మాత్రమే పరిమితమైంది. Xiaomi 15 ultra కూడా 17 ఆల్ట్రా మాదిరిగానే అనుభవాన్ని అందిస్తోంది.. లైకా ట్యూన్ ఆప్టిక్స్ తో ఇది లభిస్తోంది. ఇందులో ఓ ఐ ఎస్ తో పనిచేసే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ ఎల్ వై టి 900 సెన్సార్, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి. ఈ సెటప్ లో ఓఐఎస్ తో 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా, త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ తో 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో, 4.3 ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఇందులో ఉంది. మనదేశంలో ఈ ఫోన్ ధర 1,09,999 గా ఉంది.