Vallabhaneni Vamsi Arrested: వల్లభనేని వంశీ మోహన్ కు( Vamsi Mohan) టైం బాగాలేదు. ఎందుకంటే ఆయన మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో మరోసారి అరెస్టు తప్పేలా లేదు. 2024 ఎన్నికల సమయంలో తనపై దాడికి ప్రయత్నించారని.. హత్య చేసేందుకు యత్నించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కోసం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదులో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్ననే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతలోనే మరో కేసు మెడకు చుట్టుకోవడం పై రకరకాల చర్చ నడుస్తోంది.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) నేతల అరెస్టు పర్వం ప్రారంభం అయింది. చాలామంది నేతల అరెస్ట్ కూడా జరిగింది. అయితే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అయింది. అయితే ఇంతలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. అది కూడా వల్లభనేని వంశీ మోహన్ కావాల్సి చేసుకున్నదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ దాడి విషయంలో తన అరెస్టు ఉంటుందన్న అనుమానంతో.. అప్పట్లో ఫిర్యాదుదారుడుగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించారు వంశీ. దీంతో కూటమికి ఆయన ఎదురెళ్లినట్లు అయింది. అందుకే ఆయనపై పట్టు బిగించింది కూటమి ప్రభుత్వం. ఆ బెదిరింపు కేసును సాకుగా చూపి అరెస్టు చేసింది. వరుసగా వల్లభనేని వంశీ మోహన్ పై కేసులు నమోదవుతూ వచ్చాయి. దాదాపు 145 రోజులపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు కూడా. అయితే ఎలాగోలా బయటికి వచ్చారు వల్లభనేని వంశీ మోహన్.
* మరోసారి అటాక్!
అయితే ఇప్పుడు మరోసారి వల్లభనేని వంశీ మోహన్ మరో కేసులో అరెస్టు కాబోతుండడం నిజంగా చర్చనీయాంశమే. ఎందుకంటే ఆయన చంద్రబాబు( CM Chandrababu) సతీమణిని దారుణంగా అవమానించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చూస్తే రాజకీయాలతో సంబంధం లేని వారికి సైతం ఇబ్బందికరంగా ఉండేది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సైతం ఇది ఎంత మాత్రం నచ్చేది కాదు. అయితే ఓ 150 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ విషయంలో మరోసారి అరెస్టు ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది చర్చ. ఎందుకంటే చచ్చిన పామును మళ్ళీ మళ్ళీ చంపాలని అనుకోరు. కానీ వంశీ విషయంలో అలా చేస్తున్నారు అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక హెచ్చరిక అన్నట్టు ఉంది.
* తేలిగ్గా మాట్లాడిన వైసిపి నేతలు..
మొన్న ఆ మధ్యన ఏదోలా జైలుకు వెళ్తాము.. మళ్లీ వచ్చేస్తాం. ఏంటి ఉరి తీసేస్తారా అన్న మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపించేవి. జైలు అంటే వారికి చాలా ఈజీగా అనిపించేది. పైగా ఇటీవల పుష్ప డైలాగు వినిపిస్తూనే ఉన్నారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వీరికి.. యోగి ఆదిత్యనాథ్ లాంటి వారి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ ప్రకటన తరువాత ఇటువంటి కేసులన్నీ మళ్ళీ తెరపైకి వస్తుండడం విశేషం. అయితే వంశీ మోహన్ విషయంలో ఏదో జరుగుతోందన్న అనుమానం వెంటాడుతోంది. అయితే వంశీని మరోసారి అరెస్టు చేసి వైసిపి నేతలకు చక్కటి సంకేతాలు పంపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.