https://oktelugu.com/

WFP: ప్రకృతి ఒడిలో పని చేసుకోండి..

హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాతంలోని పత్రికానగర్ లోని GHMC ఓ పార్క్ ను నిర్మిస్తోంది. ఈ పార్క్ ఆహ్లదాన్ని ఇవ్వడమే కాకుండా అవసరాలను కూడా తీరుస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 1, 2023 / 03:40 PM IST

    WFP

    Follow us on

    WFP: ఉదయం 9 గంటలు అయిందంటే చాలు.. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి హడావుడి. బ్యాగు సర్దేసుకోవడం.. సిటీ బస్సు లేదా బైక్ పై కార్యాలయానికి వెళ్లడం.. ప్రతీరోజు మిషన్ లా ఈ ప్రక్రియ సాగుతుంది. అయితే కరోనా అటాక్ అయిన తరువాత ఈ పరిస్థితి మారిపోయింది. చాలా మంది వర్క్ ఫ్రం హోం చేయడంతో ఇంట్లోనే పనిచేయడం అలవాటుగా మార్చుకున్నారు. కొంతమంది కార్యాలయాలకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కానీ కంపెనీలు తప్పనిసరి చేయడంతో భారంగానే వెళ్తున్నారు. అయితే ఇక నుంచి ఇంట్లో, ఆఫీసుల్లోనే కాకుండా ప్రకృతిలో కూడా పనిచేసుకోవచ్చు. అందుకు సంబంధించిన సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. అదెక్కడో? ఎలాగో? తెలుసుకోండి.

    చేతిలో లాప్ టాప్ ఉండి.. అందులో ఫుల్ చార్జింగ్ ఉండే ఏ చెట్టు కిందనైనా కూర్చొని పనిచేయొచ్చు. కానీ అసౌకర్యంగా ఉంటుంది. అదే పార్కలో అయితే.. కచ్చితంగా బాగుంటుంది. అయితే ఐటీ ఉద్యోగుల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ (GHMC) ఒక బృహత్తర ప్లాన్ వేసింది. ఇంట్లో, ఆఫీసుల్లో పనిచేయడానికి ఇష్టపడని వారి కోసం పార్కుల్లో పనిచేసే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ల్యాప్ టాప్ ఉంటే పార్కుకు వచ్చి మీరు నిరభ్యంతరంగా పనిచేసుకోవచ్చు. మరి ఏ పార్కులో ఈ సౌకర్యం ఉందంటే?

    హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాతంలోని పత్రికానగర్ లోని GHMC ఓ పార్క్ ను నిర్మిస్తోంది. ఈ పార్క్ ఆహ్లదాన్ని ఇవ్వడమే కాకుండా అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో, ఆఫీసుల్లో పనిచేసినా కూడా పెండింగ్ వర్క్ ఉంటే పార్కులోకి వెళ్లి పనిచేసుకోవచ్చు. ఇక్కడికి పిల్లల కోసం కూడా ప్లే జోన్స్, సైన్స్ విషయాలు, ఓపెన్ జిమ్, యోగా సదుపాయాలను ఏర్పాటు చేశారు.

    ఐటీ ఉద్యోగులు వర్క్ చేయాలంటే వారికి లాప్ టాప్ తో పాటు సంబంధింత టెక్నికల్ పార్ట్స్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ కోసం వైఫై, ఛార్జింగ్ సదుపాయం లాంటివి కావాలి. ఇవి ఇంట్లో లేదా ఆఫీసుల్లో రెడీమెడ్ గా ఉంటాయి. అయితే ఇక్కడెలా? అనే సందేహం రావొచ్చు. కానీ ఆ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఒకేసారి 30 మంది పనిచేసేందుకు వీలుగా సిటింగ్ సౌకర్యం ఏర్పాటు చేవారు. 3 చోట్ల చార్జింగ్ సదుపాయం ఉంది. ఉచితంగానే ఇంటర్నెట్, వైఫై అందుబాటులో ఉంటుంది.

    తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు చొరవతో GHMC దాదాపు రూ.2 కోట్లతో దీనిని నిర్మించారు. కొత్తగా నిర్మించే పార్కులు ఇలాగే నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇక ఎండ, వానలతో ఇబ్బందులు కలగకుండా పైకప్పు, షెల్టర్లను కూడా నిర్మించారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.