Bro Movie Records: అరుదైన రికార్డు సాధించిన ‘బ్రో’ మూవీ.. ఫ్యాన్స్ సంబరాలు..

తమిళ మూవీ వినదయ సీతమ్ కు రీమేక్ గా వచ్చింది ‘బ్రో’ మూవీ. పవన్ కల్యాన్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించారు.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2023 3:31 pm

Bro Movie Records

Follow us on

Bro Movie Records: పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కిరికీ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా ఎలా ఉన్నా .. పవన్ ను మాత్రం వెండితెరపై చూస్తే ఆ కిక్కే వేరుంటుందని ఇటీవల లేడీ ఫ్యాన్స్ సైతం కెమెరాల ముందు వాపోయారు. వారికి అనుగుణంగానే పవన్ వరుసబెట్టి సినిమాలు తీస్తున్నాడు. తాజాగా థియేటర్లలో హల్ చల్ సృష్టిస్తున్న ‘బ్రో’ సినిమా గురించి ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ గా బిగ్ హిట్ అందుకున్న ‘బ్రో’ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. దేశంలోని బిగ్ సినిమాల సరసన ‘బ్రో’ చేరింది. ఆ వివరాల్లోకి వెళితే.

తమిళ మూవీ వినదయ సీతమ్ కు రీమేక్ గా వచ్చింది ‘బ్రో’ మూవీ. పవన్ కల్యాన్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ కోసం పవన్ 21 రోజులు మాత్రమే పనిచేశాడట. ఇందులో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ పోటీ పడి నటించారనే చెప్పొచ్చు. ఫస్ట్ రోజు నుంచే సినిమాకు కలెక్షన్ల పంట పండింది. మొత్తంగా ఈ మూవీ 97.50 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది.

ఇక తాజాగా ఈ మూవీ మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బ్రో’ మూవీ ఇండియన్ లెవల్లో హై రేటింగ్ వచ్చింది. IMDB లో బ్రో మూవీకి 9.0/10 రేటింగ్ వచ్చింది. దీంతో పవన్ కల్యాన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమా ఒరిజినల్ ‘వినోదయ సీతమ్’కు IMDB లో 8/10 రేటింగ్ రాగా.. పవన్ కల్యాణ్ సినిమాకు ఎక్కువ రావడంతో అదంతా పవన్ మాయ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై తొలి నుంచి బజ్ తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్ల మాత్రం దూసుకుపోతున్నాయి.

‘బ్రో’ మూవీకి సంబంధించిన శాటిలైట్ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ను పీపుల్ సినిమా దక్కించుకుంది. మొత్తంగా ఈ సినిమా రూ.40 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమాకు సముద్రఖని డైరెక్షన్ చేశాడు. అయితే స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ ఎప్పటిలాగే పవన్ సినిమాకు అందించాడు.