Shruti Haasan: అవును.. అక్కడ సర్జరీ చేయించుకున్నా..శృతిహాసన్

మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయ్యారు. తండ్రి కమలాసన్ బాటలోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె మిగతా ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2023 3:45 pm

Shruti Haasan

Follow us on

Shruti Haasan: ఒక సినిమాలో హీరో ఎంత ఇంపార్టెంటో.. అంతే స్థాయిలో హీరోయిన్ కూడా నటించాలి. అయితే హీరోయిన్ ఫీట్లు చేయకున్నా.. అందంగా మాత్రం ఉండాలి. తన అందాలతో సినిమాకు హైప్ తీసుకొచ్చే హీరోయిన్లు కొందరు ఉంటారు. అందుకే కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు వారికోసం స్క్రిప్ట్ లేకున్నా.. అందంతో అలరించడానికి నటింపజేస్తారు. ఈ క్రమంలో అందంగా ఉండేందుకు హీరోయిన్ పడరాని పాట్లు పడుతారు. ఎంత అందంగా ఉన్నా ఎక్కడో ఒక లోపం ఉండే ఉంటుంది. ఆ లోపాన్ని కొందరు ఎత్తి చూపుతూ రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇలాంటి కామెంట్లను ఎదుర్కొంది. దీంతో ఆమె ఏం చేసిందో తెలుసా?

మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయ్యారు. తండ్రి కమలాసన్ బాటలోనే స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె మిగతా ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ స్టార్ హీరోలందిరితో నటించి ఆకట్టుకుంది. ఇక మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కల్యాన్, అల్లు అర్జున్ లతో కలిసి నటించిన శృతిహాసన్ కొన్నాళ్ల గ్యాప్ తరువాత రవితేజతో కలిసి ‘క్రాక్’ సినిమాలో తన ప్రతాపం చూపించింది.

గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ను కొందరు ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను తట్టుకోలేని శృతి సర్జరీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమాలను తక్కువ చేసిన శృతి ప్రస్తుతం ముంబయ్ లో ఉంటోంది. తన భాయ్ ప్రెండ్ శాంతాను హజారికతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఖాళీగా ఉన్న సమయంలో ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చాట్ చేస్తూ ఉంటుంది. అయితే ఓనెటిజన్ శృతిపై హాట్ కామెంట్స్ చేశాడు.

గతంలో లాగా శృతి లేదని, పూర్తిగా మారిపోయిందని అన్నారు. అంతేకాకుండా మీరు అందం కోసం సర్జరీ చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. దీంతో శృతి స్పందించింది. ‘అవును.. నేను సర్జరీ చేయించుకున్నా.. అంతకుముందు నా ముక్కు లావుగా ఉండి ఇబ్బందికరంగా ఉండేది. సన్నగా ఉండేందుకు సర్జరీ చేయించుకున్నా..’ అని తేల్చి చెప్పింది. దీంతో ఇన్నాళ్లు శృతి హాసన్ ను కామెంట్స్ చేసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలుగులో వాల్తేరు వీరయ్య తరువాత శృతి హాసన్ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ‘సలార్’ మూవీలో నటిస్తోంది.