spot_img
HomeతెలంగాణNew Year 2023: నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరవాసులకు బిగ్ షాక్

New Year 2023: నూతన సంవత్సరం వేళ హైదరాబాద్ నగరవాసులకు బిగ్ షాక్

New Year 2023: క్యాలెండర్ పేజీల సాక్షిగా మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోబోతోంది. మరికొన్ని గంటల్లో మరో ఏడాది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. సాధారణంగా కొత్త సంవత్సరం అంటే ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. చుక్క, ముక్క తో యువత చేసే సందడి అంతా ఉండదు. పైగా మహానగరం హైదరాబాద్ లో పరిస్థితి మరింత జోరుగా ఉంటుంది. యువత రోడ్లమీద చేసే హంగామా బీభత్సంగా ఉంటుంది..ఇదే సమయంలో యువత రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకరికొకరు పోటీపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కళ్ళు మూసి తెరిచే లోపు ప్రమాదాలు జరిగిపోతాయి.

New Year 2023
New Year 2023

పోలీసులు అలర్ట్ అయ్యారు

ఈ నూతన సంవత్సరం నేపథ్యంలో హైదరాబాదులో పబ్ లు, రిసార్టులు, క్లబ్ లు కిటకిటలాడుతుంటాయి. ఈ సందర్భంగా పలు ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటాయి. ఐటి, ఫార్మా, ఇతర పరిశ్రమలు భారీగా ఉండడంతో ఉద్యోగులు ఖర్చుకు వెనకాడే పరిస్థితి ఉండదు.. పైగా ఐటి ఉద్యోగులకు వారాంతపు సెలవు దినాలు కావడంతో ఈ జోష్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పైగా హైదరాబాద్ నగరం భారీగా విస్తరించడంతో ఈసారి వేడుకలు అంబరాన్ని అంటేలా ఉంటాయి. అంతేకాదు నగర శివారు ప్రాంతాల్లో వివిధ రిసార్ట్ లు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. దీంతో జనం భారీగా పోటెత్తే అవకాశం ఉంది. ఇక అమ్యూజ్ మెంట్, థీమ్ పార్క్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు.

New Year 2023
New Year 2023

పోలీసుల ఆంక్షలు

ప్రభుత్వం మద్యం దుకాణాలను రాత్రి 1 తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రమాదాలు జరగకుండా పోలీసులు నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పలు ఫ్లై ఓవర్లను మూసివేశారు. డిసెంబర్ 31 రాత్రి 10:00 నుంచి జనవరి 1 తెల్లవారుజామున రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.. మద్యం తాగి రోడ్లమీదకి వస్తే అపరాధ రుసుం వసూలు చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు కూడా. అయితే పోలీసుల నిర్ణయంతో నగరవాసులు ఉసూరుమంటున్నారు. అటు మద్యం షాపులు తెల్లవారుజామున ఒంటి గంట దాకా ఓపెన్ చేసి ఉంచి… ఇటు రాత్రి 10 గంటలకే ఫ్లై ఓవర్లను మూసివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper