Medigadda Barrage: నిర్లక్ష్యమే మేడిగడ్డను ముంచింది.. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్‌లో సంచనల విషయాలు!

మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లు ఉండగా వాటిలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్‌డీఎస్‌ఏ తెలిపింది. 8 గేట్లలో మాత్రం సాంకేతిక, మెకానికల్‌ సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : May 8, 2024 1:55 pm

Medigadda Barrage

Follow us on

Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌కు అధికారుల నిర్లక్ష్యంతోనే కుంగిందని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. ఈమేరకు మధ్యంతర నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించింది. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరమ్మతులకు సబంధించిన గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వారికీ ప్రమాదం లేదనుకోలేమని పేర్కొన్నారు.

8 గేట్లలో సమస్య..
మేడిగడ్డ బ్యారేజీకి 85 గేట్లు ఉండగా వాటిలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్‌డీఎస్‌ఏ తెలిపింది. 8 గేట్లలో మాత్రం సాంకేతిక, మెకానికల్‌ సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్ధతిన పనులు చేయాలో నివేదికలో పేర్కొంది. మరమ్మతులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్‌ పద్మధతి రమ్మత్తులు చేపట్టాలన్నారు. ఏడో బ్లాకులో 15 నుంచి 22 పిల్లర్లు దెబ్బతిన్నందున మరమ్మతు సమయంలో గేట్లను పైకి ఎత్తివేయాలని సూచించింది.

ఆ రెండు గేట్లు తొలగించాలి..
బ్యారేజీలోని 20, 21 నంబర్‌ గేట్లను ఓపెన్‌ చేయడానికి వీలు లేనందున వాటిని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని ప్రభుత్వానికి సూచించారు. 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్‌ కుంగిపోయినందున కొత్త శ్లాబ్‌ వేయాలని తెలిపింది.

మొదటి వరదకే సమస్య..
ఇక బ్యారేజీ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్లో సమస్యలు తలెత్తాయని ఎన్‌డీఎస్‌ఏ తెలిపింది. వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటేం మిగతా పిల్లలకు సమస్యలు వచ్చేవి కావని పేర్కొంది. నిర్లక్ష్యం వలన మిగతా పిల్లర్ల పటిష్టత విషయంలో సమస్యలు లేవని అనుకోవద్ది తెలిపింది. మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.