https://oktelugu.com/

Magadheera: రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో…

గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. ఇక ఈ సినిమా ద్వారా ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 8, 2024 / 01:59 PM IST

    Magadheera

    Follow us on

    Magadheera: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘చిరుత’ సినిమాతో మొదటి సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ డాన్స్, ఫైట్లు చేయడం చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీవిని మించిన హీరో రామ్ చరణ్ అవుతాడు అంటూ అప్పుడే చాలామంది రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పారు.

    ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన మగధీర సినిమాతో ఒక్కసారిగా తన రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా రామ్ చరణ్ సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఇతను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఈ 17 ఏళ్లలో ఆయన ఇప్పటివరకు చాలా వైవిధ్య భరితమైన పాత్రలు చేస్తూ వచ్చాడు. ఈయన కెరియర్ లో ఆరెంజ్, రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, తుఫాన్, రంగస్థలం, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలను చేశాడు…ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఎన్నో అవార్డులను, ప్రశంసలను కూడ అందుకున్నాడు.

    గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు. ఇక ఈ సినిమా ద్వారా ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాకి ముందు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తక్కువగా ఉండేది. త్రిబుల్ ఆర్ సినిమా కోసం కేవలం 45 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు 100 కోట్లకు పైన రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడు. అంటే త్రిబుల్ ఆర్ సినిమా ఆయన కెరియర్ లో ఎంతటి ఇంపాక్ట్ ని చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ప్రతి ఒక్కరు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా రామ్ చరణ్ చాలా మంచి గుర్తింపు పొందాడు అని అతన్ని ప్రశంసిస్తున్నారు.

    ఇక చిరంజీవి గత చిత్రమైన ‘భోళా శంకర్’ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి మొత్తం సినిమా బడ్జెట్ వంద కోట్లు అయితే, రామ్ చరణ్ ఒక్క సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి కూడా పుత్రోత్సాహంతో చాలా సంబరపడిపోతున్నాడని వాళ్ల సన్నిహితులు చాలా మంది చెబుతూ ఉంటారు…