Site icon OkTelugu

Karimnagar Political Influence Telangana: పవర్‌ హౌస్‌గా కరీంనగర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..

Karimnagar Political Influence Telangana

Karimnagar Political Influence Telangana

Karimnagar Political Influence Telangana: కరీంనగర్‌ అంటేనే ఉద్యమాల గడ్డ. నాడు భూస్వాములపై తిరుగుబాటు చేసినా.. తర్వాత రజాకార్లపై తిరగబడినా.. తొలితరం తెలంగాణ ఉద్యమమైనా… మలిదశ తెలంగాణ పోరాటమైనా.. జగిత్యాల జైత్రయాత్ర అయినా.. నక్సల్‌ ఉద్యమమైనా.. తర్వాత జరిగిన మావోయిస్టు ఉద్యమమైనా కరీనంగర్‌ వాసులు ఉండాల్సిందే. తాజాగా రాజకీయాల్లోనూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి.. దక్కుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఈ ప్రాంతం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

కేంద్ర మంత్రి.. రాష్ట్ర మంత్రులు..
కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ 3.0 క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు దక్కిన గుర్తింపు, గౌరవంగా చెప్పొచ్చు. ఇక తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కాయి. మంథని ఎమ్మెల్యే దుద్దిళ శ్రీధర్‌బాబు కీలకమైన ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్‌ బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రిగా, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సాంక్షిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.

అసెంబ్లీలో, పార్టీలో కీలక పదవులు..
ఇక అధికాక కాంగ్రెస్‌కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు విప్‌ పదవి దక్కింది. తన పదవికి తగినట్లుగా ఆయన కార్యదక్షత చూపుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను కూడా విప్‌ పదవులు వరించాయి. దీంతో అసెంబ్లీలో కరీంనగర్‌ శక్తి మరింత పెరిగింది. ఇక మానకొండూర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. హుజూరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఈ పదవులు మూడు పార్టీల్లో కరీనంగర్‌ జిల్లా బలాన్ని నిరూపిస్తున్నాయి.

కరీంనగర్‌ ప్రాంతం రాజకీయంగా చురుకైన మట్టి కలిగి ఉంది. స్థానిక నాయకులు పార్టీలకు అంకితమై, గ్రామీణ–పట్టణ ప్రజల మద్దతుతో ఎదిగారు. బండి సంజయ్‌కు యువతలో మంచి పట్టు ఉంది. కేటీఆర్‌ టెక్నాలజీలో యువ ఉద్యోగులను ఆకట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఊపు ఇస్తూ, జిల్లాను ’పవర్‌హౌస్‌’గా మార్చుతోంది.

Exit mobile version