Star Heroine: ఈ ఫోటో లో ఉన్న చిన్నారి ఒక స్టార్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా..?

ఒక ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

Written By: Gopi, Updated On : May 8, 2024 1:54 pm

Avika Gor childhood pics

Follow us on

Star Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ కాదు. ఇక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఉన్న హీరోయిన్స్ కంటే మనం బెస్ట్ హీరోయిన్స్ గా కొనసాగాలంటే వాళ్లని సైతం మైమరిపించేలా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసినప్పుడే వాళ్లు స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇక్కడ కనిపిస్తున్న చిన్నప్పటి ఫోటోలో ఉన్నది ఆ స్టార్ హీరోయినే కావడం విశేషం.. ఇంతకు ఆమె ఎవరు అనే సందేహం మనలో అందరికీ కలుగుతూనే ఉంటుంది. అయితే ఈ అమ్మడు మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి ట్రెడిషనల్ లుక్కులో మాత్రమే కనిపిస్తూ వచ్చింది. కానీ అలాంటి పాత్రలు రావడం తగ్గిపోవడం తో కెరియర్ ఫేడౌట్ అయిపోతుందనే ఉద్దేశ్యంతో గ్లామరస్ పాత్రలను కూడా పోషించడానికి రెడీ అయింది. ఇక అందులో భాగంగానే ఆమె పోషించిన చాలా పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు ను అయితే తీసుకొచ్చాయి. ఇంతకీ ఆ చిన్నప్పటి ఫోటో లో ఉన్న హీరోయిన్ ఎవరు అనే కదా మీరు ఆలోచించేది.

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అవికా గోర్… ఇక ఈ సినిమా సక్సెస్ అయ్యాక ఈ అమ్మడు సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 లాంటి సినిమాల్లో చేసినప్పటికీ ఆమెకి తర్వాత పెద్దగా అవకాశాలైతే రాలేదు. ఇక తనే ప్రొడ్యూసర్ గా మారి పాప్ కార్న్ అనే సినిమాను కూడా నిర్మిస్తూ నటించింది. అయినప్పటికీ అది కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.

దాంతో ఈ అమ్మడు కెరియర్ డైలమాలో పడిపోయిందనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈమె తెలుగు లో అవకాశాలు లేక ఖాళీగా ఉంటుందని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా పెద్దగా అవకాశాలు లేక ఖాళీ గా ఉంటుంది. ఇక నిజానికి ఈ అమ్మడు చిన్నారి పెళ్ళికూతురు అనే టీవీ సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక అప్పటినుంచి ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వడం ఆ తర్వాత ఇండస్ట్రి లో కొద్దిరోజుల పాటు స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే…