Etala Rajender : ప్రజాప్రతినిధులు.. తమ ప్రజలకు అండగా ఉండాలి. అందుకే ఓటర్లు ఎన్నికల్లో గెలిపిస్తారు. ప్రజలకు కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా సమస్య పరిష్కరించడం, అభివృద్ధి చేయడమే చట్ట సభల ప్రతినిధుల విధి. కానీ, చాలా మంది ఎన్నికల వరకే ప్రజలకు దండాలు పెడుతున్నారు. ఎన్నికల్లో గెలిచాకా ప్రజలను పట్టించుకునేవారే కరువవుతున్నారు. కానీ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) మాత్రం ప్రజలను ఇబ్బంది పెండుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించాడు. ప్రజల పక్షాన నిలిచారు. ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే..
మల్కాజ్‌గిరి జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిల నగర్‌లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ట ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను కబ్జా చేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలుసుకున్నారు. స్థానికులు కూడా ఎంపికీ ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం గ్రామానికి వచ్చిన ఈటల పేదల భూములను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎంపీని అడ్డుకుంటామని టెంట్లు కూడా తగలబెడతామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు(Real Estate Brokers) గ్రామస్తులను బెదిరించారు. ఈ నేపథ్యంలో ఈటల భూములను పరిశీలిస్తుండగా బ్రోకర్లు అక్కడకు వచ్చారు. వారిని చూసి ఆగ్రహానికి గురైన ఈటల ఓ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు.
గ్రామస్తుల దాడి..
ఈటల చేయి చేసుకోవడంతో ఆయన వెంట ఉన్న గ్రామస్తులు, నాయకులు కూడా మూకుమ్మడిగా బ్రోకర్లపై తిరగబడ్డారు. దొరికిన బ్రోకర్‌ను చితకబాదారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
చెంప చెళ్లుమనిపించిన ఈటల రాజేందర్
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్. pic.twitter.com/yVfxIQJuUN
— Sarita Avula (@SaritaAvula) January 21, 2025