Sakshi
Sakshi: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పత్రికల్లో సాక్షి ఒకటి. ఒకప్పుడు ప్రత్యేక సంచికలు, ప్రత్యేక కథనాలతో పాఠకుల ఆదరణ పొందింది. ఈ క్రమంలో 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎం అయ్యారు. దీంతో ఏపీలో సాక్షి సర్క్యులేషన్(Circulation) గణనీయంగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లో 9 లక్షలకుపైగా సర్కులేషన్‌తో గత డిసెంబర్ వరకు దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు. టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. సాక్షి పత్రిక సర్కులేషన్ తగ్గిపోతోంది. కొత్త ప్రభుత్వం తమకు అనుకూలంగా రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిని ప్రోత్సహిస్తుంది. దీంతో పలు కార్యాలయాల్లో సాక్షి పత్రిక బంద్ అయింది. ఈ క్రమంలో సర్క్యులేషన్‌తోపాటు ప్రకటనలు కూడా బాగా తగ్గాయి. దీంతో పాఠకాదరణ పెంచుకునేందుకు సాక్షి అనేక ప్రయత్నాలు చేస్తోంది.
కొత్త ఎడిటర్..
ఈ క్రమంలో సాక్షి ఎడిటర్ మురళి(Murali)రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త ఎడిటర్‌గా ధనుంజయ్‌రెడ్డి(Dhanunjay Reddy) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన సాక్షిలో తన మార్కు చూపించుకోవాలనుకుంటూన్నారు. ఈ క్రమంలోనే జిల్లా ఎడిషన్ల నుంచి మెయిన్ ఎడిషన్ వరకు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లోటుపాట్లను, లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో పత్రికలో వార్తల క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు ఎడిషన్ ఇన్‌చార్జిలు, బ్యూరో ఇన్‌చార్జిలతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. సవరించుకోవాలన్న పనితీరుసు సూచిస్తున్నారు.
ఫ్యామిలీ, భవితకు పాఠకాదరణ..
సాక్షిలో ఒకప్పుడు ప్యామిలి(Family), భవిత(Bhavitha) పేజీలకు మంచి పాఠకాదరణ ఉండేది. ఈ రెండు పేజీలే సాక్షి భారీ సర్క్యులేషన్‌కు కారణమయ్యాయి. ఆసక్తికరమైన కథనాలు, ఆకట్టుకునే శీర్షికలు ఫ్యామిలీ పేజీలో వచ్చేవి. ఇక రామ్ ఫ్యామిలీ ఎడిటర్‌గా ఉన్న సమయంలో నన్నడగొద్దు ప్లీజ్ శీర్షికన నడిపిక కాలమ్‌కు మంచి ఆదరణ ఉండేది. ఆయన పత్రికను వీడిన తర్వాత ఫ్యామిలీలో ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇటీవలే కాస్త మంచి కథనాలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక భవిత అయితే ప్రింటింగ్ పూర్తిగా బంద్ అయింది. ఈ పేపర్‌గా భవిత ఇస్తున్నారు. ఈపేపర్ చూసే వారు మాత్రం దానిని వెతుక్కుంటున్నారు. భవితను ప్రింట్‌లో ఇవ్వాలన్న డిమాండ్ సాక్షి పాఠకుల నుంచి ఉంది.
ఆయనను తీసుకురావాలని..
సాక్షి సర్కులేషన్ పెరగడానికి కొత్త ఎడిటర్ ఇటీవల క్షేత్రస్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకున్నారు. సాక్షికి మరమ్మతులు చేయడమే తన ముందు ఉన్న ప్రథమ టార్గెట్‌గా ఎడిటర్ పనిచేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్‌తోపాటు, ఎడిషన్ సెంటర్ల రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, డెస్క్ ఇన్‌చార్జీలు, ఎడిషన్ ఇన్‌చార్జీల అభిప్రాయం కూడా తెలుసుకున్నారు. వారి నుంచి సూచనలు స్వీకరించారు. ఈ క్రమంలో ఫ్యామిలీ, భవిత పేజీని స్ట్రెంథెన్ చేయాలన్న సూచనలు వచ్చాయి. దీంతో కొత్త ఎడిటర్ వాటిపై దృష్టిపెట్టారు.
ఆయనను తీసుకురావాలని..
గతంలో ఫ్యామిలీ పేజీ ఎడిటర్(Editor)గా పనిచేసిన రామ్‌ను మళ్లీ తీసుకురావాలని కొంత మంది ఎడిషన్ ఇన్‌చార్జిలు, బ్యూరో ఇన్‌చార్జిలు, డెస్క్ ఇన్‌చార్జీలు సూచించారు. దీంతో ఆయన కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వికాస్ అనే వ్యక్తి ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.‘ముందు ఈయన్ని తీసుకు రండి సాక్షి లోకి. రామ్ గారు ఎంత సిన్సియర్ అనేది అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. పని చేసే వాళ్ళని పక్కన పడేసి స్క్రాప్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు.’ అని పోస్టు చేశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.
ముందు ఈయన్ని తీసుకు రండి సాక్షి లో కి @YSBharathi9 @ysjagan
రామ్ గారు ఎంత సిన్సియర్ అనేది అక్కడ పని చేసే ప్రతి ఒక్కరికి తెల్సు
పని చేసే వాళ్ళని పక్కన పడేసి స్క్రాప్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు pic.twitter.com/CfGhd76pLI
— Vïkas (@Fan_Of_JaGUN) January 20, 2025