CM Chandrababu : దావోస్ పెట్టుబడుల సదస్సులో ఏపీ ప్రభుత్వం( AP government ) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం సదస్సులో పాల్గొంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సిలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మి మిత్తల్ తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశం అయ్యారు. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భావనపాడులో పెట్రోల్ కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు రావాలని మిట్టల్ గ్రూపునకు ఏపీ ప్రభుత్వం కోరింది. మరోవైపు దావోస్ లో ఏపీ ప్రభుత్వ బృందం పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలు జరిపారు. వివిధ సంస్థల ప్రతినిధులతో 15కు పైగా సమావేశాల్లో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహించారు. ఇవి విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది.
* నేడు సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తో భేటీ
గ్రీన్ హైడ్రోజన్- గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్( green hydrogen- green manufacturing), నెక్స్ట్ పెట్రో కెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకనామిక్ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతున్నారు. మరోవైపు సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్ తో సైతం చంద్రబాబు భేటీ కానున్నారు. వెల్స్ పన్ చైర్మన్ బి కే గోయాంక, ఎల్జి కెమ్ సీఈవో షిన్ హాక్ చియోల్, కార్ల్స్ బర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ అండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్ మార్ట్ ప్రెసిడెంట్ – సీఈవో కాత్ మెక్ లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్సు, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో ఈరోజు పెట్టుబడులపై చర్చించనున్నారు. బ్లూ బర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు చంద్రబాబు.
* మిట్టల్ గ్రూపు చైర్మన్ తో భేటీ
మరోవైపు దావోస్ లో మిట్టల్ గ్రూప్( Mittal group) ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ ఆదిత్య మిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఆర్సలర్
మిట్టల్, రెస్పాన్స్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్నదానిపై చర్చలు జరిపారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా భావనపాడు లో పెట్రోల్ కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు మిట్టల్ గ్రూపును ఆహ్వానించారు. భావనపాడు పెట్రోల్ కెమికల్స్ అన్వేషణకు అనువైన ప్రాంతమని చెప్పారు. అలాగే రాష్ట్రంలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కూడా కోరారు. 3,500 కోట్లతో హెచ్పీసీఎల్, మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇండియాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని వారికి హామీ ఇచ్చారు.
* టూర్ సక్సెస్
మరోవైపు చంద్రబాబు( Chandrababu) పర్యటన సక్సెస్ గా ముందుకు సాగుతూ ఉండడంతో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. తమ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు వరుసగా జరుపుతున్న భేటీలు విజయవంతం అవుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. ఇది ఏపీకి శుభపరిణామం.