Sambasiva Rao Debate: తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రికేయులు సాంబశివరావు గారు. మిగతావారి లాగా ఈయనలో వాగాడంబరం ఉండదు. అతిశయోక్తి కనిపించదు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొడతారు. కొన్ని విషయాలలో మేనేజ్మెంట్ లైన్ కు భిన్నంగా వెళ్తారు. ఆయన జర్నలిజం లో ఉన్న బ్యూటీ కూడా అదే కాబట్టి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇందులో కొంతమంది ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీటితో సంబంధం లేకుండా ఆయన తన జర్నలిజం కెరియర్ కొనసాగిస్తూనే ఉన్నారు..
Also Read: కల్వకుంట్ల కవిత చెప్పింది అబద్దమా… వైఎస్ ను హరీష్ అందుకే కలిశారా.. వెలుగులోకి సంచలన వీడియో
భారత రాష్ట్ర సమితి నుంచి కవిత సస్పెన్షన్.. హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటి నేపథ్యంలో టీవీ5 ఒక డిబేట్ పెట్టింది. ఈ డిబేట్ ను సాంబశివరావు కొనసాగించారు. భారత రాష్ట్ర సమితి కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్ రావు ఈ డిబేట్ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి పై అవినీతి ఆరోపణలు చేశారు. దేశంలో అతిపెద్ద ధనిక ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. దీనిని సాంబశివరావు వ్యతిరేకించారు. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ. రవీందర్రావు తన ఉగ్రరూపాన్ని చూపించారు.. సాంబశివరావుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అనర్ఘళంగా మాట్లాడారు. కెసిఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చాడని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని.. ఉద్యోగాలను, నీళ్లను అందుబాటులోకి తెచ్చాడని.. కరెంటు ఉత్పత్తి అవుతోందని.. తెలంగాణ అన్ని విధాలుగా బాగుపడుతోందని రవీందర్రావు వ్యాఖ్యానించారు. రవీందర్రావు అలా మాట్లాడుతూ ఉంటే సాంబశివరావు జస్ట్ చూస్తూ ఉండిపోయారు. చివరికి రవీంద్రరావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానంటూ సాంబశివరావు పేర్కొనడం విశేషం.
ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. రవీందర్రావు మాటల దాడికి సాంబశివరావు నిశ్శబ్దంగా ఉండిపోయారని.. రవీందర్రావు సాంబశివరావు దుమ్ము దులిపారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ డిబేట్ మొత్తం పెట్టకుండా కేవలం రవీందర్రావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో బిట్లను మాత్రమే గులాబీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. రవీంద్రరావు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని.. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు.. ఎవరు నష్టపోయారు.. ఎవరు పదవులు అనుభవించారు.. ఎవరు కోట్లకు పడగలు ఎత్తారు.. అనే విషయాలు అందరికీ తెలుసని.. రవీందర్రావు మాట్లాడినంత మాత్రాన అవేవీ నిజాలు అయిపోవని కాంగ్రెస్ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సాంబశివరావు మరోసారి గులాబీ కార్యకర్తల చేతిలో ట్రోలింగ్ కు గురికావడమే ఇక్కడ అసలైన విషాదం.
సాంబశివరావు గారి
దుమ్ము దులిపేశారు రవీందర్ రావు గారు.#Telangana pic.twitter.com/Hnw4UyrYAP
— Abdul Majeed (@abdulma32033529) September 4, 2025