MLC Kavitha New Party: కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేశాయి. ఎటువైపు దారి తీస్తాయోననే చర్చ తీవ్రంగా సాగుతోంది. పార్టీలో ఏర్పడిన బీటలను కల్వకుంట్ల కవిత రాసిన లేఖ స్పష్టం చేస్తోందని నేతలు చర్చించుకుంటున్నారు.. వాస్తవానికి పార్టీలో ఉన్న సమస్యలను పార్టీ సుప్రీం వద్దకు తీసుకువెళ్లాలని.. ఇందులో నా ఓన్ ఏజెండా అంటూ ఏదీ లేదని.. కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అయితే ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెడతారనే చర్చ జోరందుకోవడం ఇక్కడ విశేషం. ఒకవేళ ఆమె పార్టీ పెడితే ఎంతమంది అటువైపు వెళ్తారు? అసలు ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందా? లేకుంటే పార్టీలోని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ను సుప్రీం వద్దకు తీసుకెళ్లారా? అనే విషయాలపై మాత్రమే చర్చ సాగుతోంది.. గతంలో గులాబీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ఆలే నరేంద్ర, విజయశాంతి లాంటివారు బయటకు వచ్చారు. కారు పార్టీలో ఉక్కపోతను భరించలేక ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. విశ్వసినీ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ అధిష్టానం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక దీనికి తగ్గట్టుగానే ఇటీవల నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో కోరుకున్న సామాజిక తెలంగాణను అందుకోలేకపోయామని.. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ.. సెంటు భూమిలేని పేదలకు న్యాయం చేయలేకపోయామని ఆమె వాపోయారు. ” నన్ను కావాలని కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆరు నెలలపాటు జైల్లో ఉన్నాను. నాపై వారికి ఇంకా కోపం తగ్గలేదా.. నన్ను ఎంత ఇబ్బంది పెడితే. నేను అదే స్థాయిలో స్పందిస్తానని” కవిత అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
కల్వకుంట్ల కవిత రాసిన లెటర్ నేపథ్యంలో హై కమాండ్ పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరు కూడా రెస్పాండ్ కావద్దని స్పష్టం చేసింది.. కవిత లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఓ నాయకుడు మాత్రమే ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు. గులాబీ మీడియా ఆ లెటర్లు మొత్తం ఫేక్ అని నిర్ధారించింది. మరి ఇప్పుడు కవిత స్వయంగా చెప్పడంతో తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి. అన్నట్టు గులాబి పార్టీ ఎమ్మెల్సీ రాసిన లేఖ తర్వాత.. తదనంతర పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూసిన తర్వాతే రెస్పాండ్ కావాలని పార్టీ శ్రేణులకు హై కమాండ్ సూచించినట్లు సమాచారం. మరోవైపు కవిత లెటర్ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచామనే కొద్దిరోజులే ఉండడం విశేషం. వాస్తవానికి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చూసిన తర్వాత కొద్ది రోజులపాటు గులాబీ పార్టీ సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై గులాబీ పార్టీ దూకుడుగా ఉంటున్నది. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల వరంగల్ సభ పార్టీలో కొంచెం జోష్ తీసుకువచ్చింది. అయితే ఇది కవిత రాసిన లెటర్ వల్ల ఒక్కసారిగా మాయమైందని.. పేరు రాయడానికి ఇష్టపడని గులాబీ పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సొంత ఇంటి వ్యవహారాన్ని చక్కదిద్దుకోలేనప్పుడు.. ఇక అధికారంలోకి ఎలా వస్తారు? ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని ఆ నేత వ్యాఖ్యలు చేయడం విశేషం.