Allu Arjun car hits a wall : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) కి సంబంధించి ఏ చిన్న విషయం సోషల్ మీడియా లో వచ్చినా అది తెగ వైరల్ గా మారిపోతుంది. అది పాజిటివ్ అయినా సరే, నెగటివ్ అయినా సరే సోషల్ మీడియా ఊగిపోవాల్సిందే. అది అల్లు అర్జున్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్. అయితే నేడు ఆయన తన ఇంటి లోకి కారులో వెళ్తున్న సమయం లో ఇంటి ముందు ఉన్న ఒక చిన్న గోడని తొక్కుతూ ముందుకు వెళ్లడం, ఆ గోడ ముక్కలు అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ తన కారుని సాధారణమైనంత వరకు తానే డ్రైవ్ చేస్తాడు. అయితే ఈ వీడియో ని చూసిన అభిమానులు ఏంటన్నా ఆ కార్ డ్రైవింగ్, కాస్త చూసుకొని వెళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : అల్లు అర్జున్ కేసులో సంచలన ట్విస్ట్..సీవీ ఆనంద్ కి నోటీసులు జారీ చేసిన NHI!
ఇక అల్లు అర్జున్ ఏ చిన్న పొరపాటు చేసినా సోషల్ మీడియా లో నెగటివ్ చేయడానికి దురాభిమానుల కొంతమంది ఉంటారు. కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాదు, ప్రతీ స్టార్ హీరోకి కూడా దురాభిమానుల ఉంటారనుకోండి, కానీ ఈమధ్య అల్లు అర్జున్ కి కాస్త ఎక్కువ పెరిగారు. ఈ వీడియో ని చూసిన అల్లు అర్జున్ దురాభిమానుల ఈయనకు సరిగా డ్రైవింగ్ చేయడం కూడా రాదనీ ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేస్తే అల్లు అర్జున్ అభిమానులు ఊరుకోరు కదా, వాళ్ళు కూడా గట్టిగా తిరిగి ఇచ్చేస్తున్నారు. అలా ట్రోల్స్ కి కారణమైన ఆ వీడియో ని ఈ ఆర్టికల్ చివర్లో అందిస్తున్నాము మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee) తో చేసే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఆయన సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పాత్రల్లో ఆయన కనిపించబోతున్న సందర్భంగా, ఒక పాత్రలో ఆయన అభిమానులు కూడా గుర్తుపట్టలేని గెటప్ లో కనిపిస్తాడట, అందుకోసమే అల్లు అర్జున్ ప్రస్తుతం తన శరీరాన్ని పెంచుకునే పనిలో పడ్డాడు. ఇకపోతే ఈ చిత్రం లో ఏకంగా 5 మంది హీరోయిన్లు నటించబోతున్నారట. అందులో దీపికా పదుకొనే(Deepika Padukone), మృణాల్ ఠాకూర్(Mrunal thakur), జాన్వీ కపూర్ ఇప్పటికే ఖరారు అయ్యారు. భాగ్యశ్రీ భోర్సే కూడా ఈ చిత్రం లో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.