HomeతెలంగాణMLC Balmuri Venkat : మళ్లీ పరువు పాయే.. కేసీఆర్ తిట్లు చూపించబోయి రేవంత్ బూతులు...

MLC Balmuri Venkat : మళ్లీ పరువు పాయే.. కేసీఆర్ తిట్లు చూపించబోయి రేవంత్ బూతులు చూపించారు

MLC Balmuri Venkat : కానీ నేటి కాలంలో రాజకీయ నాయకులు ఏమాత్రం తగ్గడం లేదు. పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. హో రాహోరిగా తిట్టుకుంటున్నారు. మరీ దారుణంగా వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. దీనివల్ల రాజకీయాలు అంటేనే ఏవగింపు కలుగుతున్నది. రాజకీయ నాయకులు అంటేనే చులకన భావం ఏర్పడుతోంది. అయితే సోషల్ మీడియా వినియోగం విపరీతంగా ఉన్న నేటి రోజుల్లో.. బూతులకు కొదవలేదు. అడ్డగోలుగా మాట్లాడే మాటలకు కొదవలేదు. అందువల్లే నాయకులు తగ్గేది లేదు అన్నట్టుగా బూతులు మాట్లాడుకుంటున్నారు. గురివింద తన నలుపు తాను ఎరగదన్నట్టుగా.. ఒకరి బూతులను మరొకరు మీడియా సమావేశంలో పెట్టుకుంటూ.. తాము సుద్దపూసలమని చెప్పుకుంటున్నా.

Also Read: మల్లారెడ్డి సార్.. ఈ వయసులో ఈ కసి వ్యాఖ్యలేంటి సార్!

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎన్నిసార్లు బూతులు తిట్టారో.. ఎన్నిసార్లు విమర్శించారు వివరించే ప్రయత్నం చేశారు వెంకట్. అందులో భాగంగా ట్యాబ్ లో స్టోర్ చేసిన కేటీఆర్ మాటలను వీడియోల రూపంలో చూపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా మీడియా ప్రతినిధులకు బల్మూరి వెంకట్ వినిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం బల్మూరి వెంకట్ మాట్లాడిన మాటలలో కొన్నిటిని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. కేటీఆర్ అన్న మాటలు వినిపించబోయి.. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల తాలూకూ వీడియోలను చూపించారని ప్రచారం చేయడం ప్రారంభించింది. నేటి సోషల్ మీడియా రోజుల్లో నిజం కంటే అబద్దానికే ప్రచారం ఎక్కువ. అబద్దానికే రీచ్ ఎక్కువ కాబట్టి అలానే జరుగుతోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రెస్పాండ్ అయ్యే సమయంలో పే జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇలాంటి కౌంటర్లకు రీకౌంటర్ కూడా ఇవ్వాలి. లేకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. అసత్యాలే యదార్ధాలుగా మారిపోతాయి. తర్వాత గొంతు చించుకొని విలేకరుల సమావేశం నిర్వహించినా పెద్దగా ఉపయోగముండదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ” కేటీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను ముందుగా వెంకట్ మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వినిపించారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో భారత రాష్ట్ర సమితి అనుకూల ట్విట్టర్ ఐడీలలో రేవంత్ మాట్లాడిన మాటలు మాత్రమే ప్రధానంగా చూపించారు. తద్వారా కేటీఆర్ చేసిన విమర్శలకు బదులుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులోనే కాంగ్రెస్ నాయకులు మీడియా ప్రతినిధుల సమక్షంలో చూపించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.. ఇలాంటి వాటివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అందువల్లే రీకౌంటర్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని” రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also Read : నితిన్ భార్య షాలిని చిరంజీవికి బంధువు అవుతుందనే విషయం మీకు తెలుసా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version