Hero Nithin Wife Shalini
Hero Nithin : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోలలో ఒకరు నితిన్(Hero Nithin). యంగ్ హీరోలలో కెరీర్ పరంగా నితిన్ చూసినన్ని ఎత్తుపల్లాలు ఎవ్వరూ చూడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. మొదటి సినిమా సంవత్సరం రోజులకు పైగా ఆడింది. ఆ తర్వాత కెరీర్ లో వరుసగా రెండు మూడు హిట్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత నితిన్ కి దాదాపుగా 13 ఫ్లాప్ చిత్రాలు వచ్చాయి. ఆయన స్థానంలో వేరే ఏ హీరో ఉన్నా కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పేసి వేరే వ్యాపారం చూసుకునే వాళ్ళు. కానీ నితిన్ పడిన చోటనే లేచి బలంగా నిలబడ్డాడు. ‘ఇష్క్’ చిత్రంతో భారీ కం బ్యాక్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ వరుస బ్లాక్ బస్టర్స్ ని ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. టాలీవుడ్ హిస్టరీ ఇప్పటి వరకు ఒక యంగ్ హీరోకి ఇలాంటి పరిస్థితి రాలేదు.
Also Read : రాబిన్ హుడ్ ఫుల్ మూవీ రివ్యూ…
అయితే నితిన్ ఇప్పుడు మళ్ళీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ రేంజ్ టాక్ వచ్చింది. వసూళ్లు కూడా యావరేజ్ రేంజ్ లోనే ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే నితిన్ షాలిని అనే అమ్మాయిని 2020 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంటకు సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే షాలిని కి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. షాలిని కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఒక ప్రత్యేకమైన బంధం ఉందట.
రక్త సంబంధం ప్రకారం వీళ్ళు బంధువులు కాకపోయినా, చిరంజీవి మాత్రం షాలిని గారి తల్లిని సొంత సోదరిలాగానే బావిస్తాడట. ఇంతకు వీళ్ళ మధ్య అంతటి అనుబంధం ఎలా ఏర్పడిందో ఒకసారి క్లుప్తంగా చూద్దాము. వివరాల్లోకి వెళ్తే షాలిని తల్లితండ్రుల పేర్లు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్. మతాలు వేరైనప్పటికీ, వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కర్నూలు లో గత 20 సంవత్సరాలుగా ఈ దంపతులిద్దరూ ప్రగతి నర్సింగ్ హోమ్ ని నడుపుతున్నారు. ఈ నర్సింగ్ హోమ్ ద్వారా కర్నూలు ప్రజలకు దంపతులు ఎన్నో సేవలు అందించారు. వీళ్ళ సేవా భావాన్ని గుర్తించి మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో తన ప్రజారాజ్యం పార్టీ లో నూర్జహాన్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఆమెకు గణనీయమైన ఓట్ల శాతం దక్కినప్పటికీ ఓడిపోవాల్సి వచ్చింది. కానీ అప్పటి నుండే ఈమెకు చిరంజీవి సోదరుడు అయ్యాడు. ఇప్పటికీ వీళ్ళ మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నది.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!