GT vs MI : ఐపీఎల్ లో భాగంగా అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ (GT vs MI) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు లాస్ అయ్యి 196 రన్స్ స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (63), గిల్(38), బట్లర్ (39)టాప్ స్కోరర్లు గా నిలిచారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, రెహమాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.. గుజరాత్ ఓపెనర్లు తొలి వికెట్ కు 8.3 ఓవర్ లలో 78 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గిల్(38) హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ ఆటగాడిగా వచ్చిన బట్లర్ (39) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. అతడు ముజీబ్ బౌలింగ్లో రికెల్టన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియమన్ చేరుకున్నాడు అయితే ఈ దశలో వచ్చిన ఆటగాళ్లు ఎవరూ మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (63) కు సహకరించలేదు.. రాహుల్ తేవాటియ (0), షారుక్ ఖాన్ (9), రూథర్ఫర్డ్ (18), రషీద్ ఖాన్(6), రబాడా (7) ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరోవైపు సాయి సుదర్శన్ కూడా సెంచరీ చేస్తాడనుకుంటే.. 63 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 200 దాటుతుందనుకున్న గుజరాత్ స్కోర్ 196 పరుగుల వద్ద ముగిసింది.
Also Read : సాయి సుదర్శన్ 4 సార్లు.. శుభ్ మన్ గిల్ వెయ్యి..
చూస్తుండగానే మూడు వికెట్లు..
ఒకానొక దశలో గుజరాత్ జట్టు 17.5 ఓవర్లలో 174/4 తో పటిష్ట స్థితిలో ఉంది. ఈ దశలో గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేస్తుందని అందరు అనుకున్నారు. 200 మార్క్ అందుకుంటుందని భావించారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ సలహా కోరాడు. దీంతో రోహిత్ తన అనుభవాన్ని మొత్తం అతడికి చెప్పాడు. బౌలింగ్ లో ఎలాంటి మార్పులు తీసుకోవాలో వివరించాడు. హార్థిక్ పాండ్యాకు కొన్ని సూచనలు చేయడంతో.. అతడు కూడా వాటిని అమలులో పెట్టాడు. ఫలితంగా 17.6 ఓవర్లో బౌల్టు బౌలింగ్లో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. అప్పటికి గుజరాత్ జట్టు స్కోరు 174 పరుగులు. ఈ వికెట్ పడిపోవడంతో గుజరాత్ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత 18.1 ఓవర్ వద్ద రాహుల్ తేవాటియ (0) హార్దిక్ పాండ్యా చేతిలో రన్ అవుట్ అయ్యాడు. అప్పటికి గుజరాత్ స్కోర్ 179 పరుగులు. ఇక అదే ఓవర్ రెండవ బంతికి రూథర్ఫర్డ్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. వైవిధ్యంగా బంతులు వేసే దీపక్ చాహర్ కు 18వ ఓవర్ ఇవ్వమని రోహిత్ చెప్పడం.. దానిని హార్దిక్ పాటించడంతో ముంబై జట్టుకు మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఒకవేళ రాహుల్ తేవాటియ, రూథర్ఫర్డ్ క్రీ జ్ లో ఉండి ఉంటే మైదానంలో పరుగుల వరద పారేది. ఎందుకంటే వీరిద్దరూ కూడా హార్డ్ హిట్టర్లు. ఎటువంటి బౌలర్ల బౌలింగ్ అయినా సులభంగా ఎదుర్కొంటారు. వీరిద్దరూ వరుస బంతుల్లో అవుట్ కావడంతో గుజరాత్ జట్టు భారీ స్కోరుపై ఆశలు వదిలేసుకుంది.. ఇక రోహిత్ తన విలువైన అనుభవాన్ని హార్దిక్ పాండ్యాకు చెప్పడం.. అతడు అమలులో పెట్టడంతో ముంబై జట్టు మెరుగైన ఫలితాలు సాధించగలిగింది.. అందువల్లే గుజరాత్ జట్టు 200 మార్క్ స్కోరును అందుకోలేకపోయింది. హార్దిక్ పాండ్యాకు రోహిత్ చెబుతున్న సూచనలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
Also Read : ఐపీఎల్ సోషల్ బజ్: తలైవా ధోని కంటే కింగ్ కోహ్లీనే తోపు