MLAs Defection Case
MLAs Defection Case: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుపై వరుసగా రెండో రోజు సుప్రీం కోర్టు(Supream Court)లో విచారణ మొదలైంది. బుధవారం(మార్చి 2న) స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. గురువారం(మార్చి 3న) కూడా మరోమారు అసహనం వ్యక్తం చేసింది.
Also Read: రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ బీఆర్ గవాయ్Iustice Gavai), జస్టిస్ అగస్టీన్ జార్జి(Justice Agasteen Jargi) మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ(Abhishake Singwi), ముకుల్ రోహత్గీలు వాదనలు వినిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ బెంచ్, ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయం కోసం మీకు ఎంత సమయం కావాలి?‘ అని సింఘ్వీని ప్రశ్నించగా, ‘ఆరు నెలలు‘ (Six Months)అని ఆయన సమాధానమిచ్చారు. దీనిపై బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘ఇప్పటికే 14 నెలలు వృథా అయ్యాయి, మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?‘ అని నిలదీసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం గతంలో వాదనలు వినిపించగా, బుధవారం స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలను పూర్తి చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు శాసించలేవని, నిర్ణయం తీసుకునే ముందు జ్యుడీషియల్ రివ్యూ(Judishial Review) వర్తించదని రోహత్గీ వాదించారు. అయితే, ‘స్పీకర్ ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా?‘ అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. రోహత్గీ మాట్లాడుతూ, పదో షెడ్యూల్‌లో స్పీకర్‌కు నిర్ణీత సమయం నిర్దేశించే నిబంధన లేదని, ఈ అంశాన్ని శాసన వ్యవస్థకు వదిలేయాలని కోరారు. దీనికి సుప్రీం కోర్టు స్పందిస్తూ, ‘ఫిరాయింపులను నిరోధించేందుకే పదో షెడ్యూల్(10th Schdule) తెచ్చారు. దాని ఉద్దేశాన్ని కాపాడడం కోర్టుల రాజ్యాంగబద్ధ బాధ్యత. పార్లమెంటు సవరణ చేయలేదని కోర్టులు నిష్క్రియంగా ఉండాలా?‘ అని పేర్కొంది. ఈ విషయంలో రాజ్యాంగ సంస్థలు తమ విధులను నిర్వర్తించాలని, అందుకు కోర్టులు మార్గదర్శనం చేయడం తప్పు కాదని స్పష్టం చేసింది.
పార్టీ మారడంతో వివాదం..
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఈ వివాదం తలెత్తింది. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్(BRS) కోరుతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు చేరింది. ఈ కేసు రాజకీయ, రాజ్యాంగ దష్ట్యా కీలకంగా మారింది. విచారణ ఇంకా కొనసాగుతుండగా, సుప్రీం కోర్టు తీర్పు ఈ వివాదంలో నిర్ణయాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Mlas defection case supreme court hearing
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com