Raja Saab OTT Rights: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన ‘రెబల్ సాబ్’ పాట ఫ్యాన్స్ ని అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండవ పాటని విడుదల చేయబోతున్నారు. కనీసం ఈ పాట అయినా ఆడియన్స్ ని అలరిస్తుందో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇంత కాలం అమ్ముడుపోకపోవడం గమనార్హం. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సంస్థలతో నెలల తరబడి సుదీర్ఘ చర్చలు జరిపారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఎట్టకేలకు జియో హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ముందుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తో వంద కోట్ల డీల్ కోసం నిర్మాతలు చర్చలు జరిపారట. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ అందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు. ప్రభాస్ రీసెంట్ చిత్రాలన్నీ నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. సలార్ చిత్రానికి 20 మిలియన్ కి పైగా వ్యూస్, అదే విధంగా కల్కి హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేయగా, దానికి ఏకంగా 24 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంతే కాకుండా గతం లో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రానికి కూడా నెట్ ఫ్లిక్స్ లోకి మంచి వ్యూస్ వచ్చాయి. ఇంత మినిమం గ్యారంటీ రేంజ్ ఉన్న హీరో కి కూడా వంద కోట్లకు రైట్స్ కొనుగోలు చేయడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ మొగ్గు చూపడం లేదంటే ప్రస్తుతం ఓటీటీ సంస్థలు ఏ రేంజ్ నష్టాలను చూస్తున్నాయి అర్థం చేసుకోవచ్చు.
అయితే జియో హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని రీసెంట్ గానే 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు టాక్. ఇది ప్రభాస్ రేంజ్ కి చాలా తక్కువ. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న స్పిరిట్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 170 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. రాజాసాబ్ కి అందులో సగం కూడా లేకపోవడమంటే తక్కువే కదా. హాట్ స్టార్ డీల్ ముగిసింది కాబట్టి ఇక ఈ చిత్రం విడుదలకు ప్రస్తుతానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఫైనాన్స్ కి సంబంధించి ఒక పెద్ద సమస్య కోర్టు లో నడుస్తోంది. దీనిని రాబోయే రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో చూడాలి.