Anchor Rashmi : బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నటి రష్మీ(Anchor Rashmi). ఈమె జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఈమె యువ అనే టీవీ సీరియల్ లో కనిపించేది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కూడా మెరిసింది. చివరికి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈటీవీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలు పెట్టిన జబర్దస్త్(Jabardasth) షోతో యాంకర్ గా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి ఫుల్ బిజీ గా మారిపోయింది. ఇప్పటికీ ఈమె జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company) షోస్ కి యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
సోషల్ మీడియా లో కూడా నిత్యం యాక్టీవ్ గా ఉండే రష్మీ, తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టిన ఒక ఫోటో ఆమె అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది. ఆమె మాట్లాడుతూ ‘గత కొంతకాలం నుండి భుజం నొప్పి తో చాలా బాధపడుతున్నాను. ఆ కారణం చేత నేను నాకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ కి దూరమయ్యాను. ఇప్పుడు నేను నా భుజానికి సర్జరీ చేయించుకుంటున్నాను. ఇక నుండి నేను ఎప్పటి లాగానే డ్యాన్స్ చేయగలుగుతానని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నప్పుడు ఆమె ఈ ఫోటో తీసుకొని అప్లోడ్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఈ స్టోరీ ని చూడని వాళ్ళు, ఇతర మాధ్యమాలలో ఆమె హాస్పిటల్ బెడ్ మీద పాడుకోవడాన్ని చూసి రష్మీ కి ఏమైంది అంటూ కంగారు పడ్డారు. అసలు విషయం తెలుసుకున్న తర్వాత రిలాక్స్ అయ్యారు.
ఇకపోతే రష్మీ బుల్లితెర మీద మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి ఆమె చేసిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత కూడా ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, కొన్ని చిత్రాల్లో నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ కూడా చేసింది, కానీ అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. చూసేందుకు ఎంతో అందంగా కనిపించే రష్మీ, డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. అందం, టాలెంట్ రెండు ఒకే చోట ఉన్న హీరోయిన్లు దొరకడం ఇప్పటి కాలం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ రష్మీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రావడం లేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఆమె అభిమానులు కోరుకున్నట్టు ఉన్నత స్థాయికి వెళ్తుందో లేదో చూడాలి.