Konda Surekha Vs KTR: తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆరోపణలను కొంత మంది నాయకులు ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు చేసిన ఆరోపణలతో తమ పరువుకు భంగం వాటిల్లింది అంటూ కోర్టుకు ఎక్కుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల ఈ కొత్త సంస్కృతికి మొదట తెరలేపారు. దీనినే కాంగ్రెస్, బీజేపీ కూడా ఫాలో అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కోర్టులను ఆశ్రయించారు. గతంలో కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేయకుండా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. తర్వాత జన్‌వాడలో అక్రమ ఫామ్‌హౌస్ నిర్మాణంపై ఆరోపణలు వచ్చాయి. దీనిపైనా ఆయన కోర్టుకు వెళ్లి విమర్శలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. తర్వాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పేరు ఉన్నట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేయకుండా ఉండేందుకు అన్న బాటలో చెల్లి కవిత కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇలా విపక్షాలు చేసే ఆరోపణలను తప్పించుకోవడానికి గులాబీ నేతలు కోర్టులే శరణ్యం అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ట్రెండ్‌ను కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఫాలో అవుతున్నారు. బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్.ప్రభాకర్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షిపై డబ్బులు మోసుకెళ్తున్నారని, ఖరీదైన కారుగిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు. దీనిపై దీపాదాస్ ముని‍్ష కూడా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇటీవల సినీ నటుడు నాగార్జున కూడా రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై కోర్టుకెక్కారు. తమ కుటుంబం పరువకు భంగం వాటిల్లేలా మంత్రి వ్యాఖ్యలు చేశారని పిటిషన్ వేశారు. తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కూడా కొండా సురేఖపై పరువు నష్టం పిటిషన్ వేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తర్వాత కేంద్ర మంత్రి, బండి సంజయ్‌పైనా కేటీఆర్ కోరు‍్టకు ఎక్కారు. ఇక ఇప్పుడు కేంద్ర మంత్రి సంజయ్ కూడా అదే ఆలోచన చేస్తునా‍్నరు. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై పరువు నష్టం నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు.
కేటీర్ ముందు..
పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేయడంలో తెలంగాణలో కేటీఆర్ ముందు వరుసలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతలపై మూడు, నాలుగు పరువు నష్టం పిటిషను‍్ల వేశారు. అధికారం కోల్పోయిన పది నెలల్లో మరో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పొలిటికల్ గేమ్‌లో భాగంగా మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ మధ్య మొదలైన గొడవ.. క్రమంగా అక్కినేని కుటుబానికి వ్యాపించింది. దీంతో నాగార్జున కూడా పరివునష్టం దావా వేశారు. ఆ కేసు కొనసాగుతుండగానే కేటీఆర్ కూడా సురేఖపై మరో పరువునష్టం దావా వేశారు.
బీజేపీ కూడా…
ఇక కాంగ్రెస్-బీఆర్‌ఎస్ ఆడుతున్న పరువు నష్టం గేమ్‌లోకి ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ అయింది. లేదంటే తమను ప్రజలు పట్టించుకోరన్న భావనతో పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పరువు నష్టం దావాల విషయంలో యాక్టివ్ అయ్యారు. కేటీఆర్ తనకు పంపిన పరువు నష్టం నోటీసులకు తాను కూడా పరువు నష్టం పిటిషన్ తోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తాజాగా గ్రూప్-1 అభ్యర్థులతో చేపట్టన పాదయాత్ర సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో ప్రసు‍్తతం పరువు నష్టం రాజకీయాలు జరుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల సాధారణమే. కానీ, కేటీఆర్ మొదలు పెట్టిన ఈ పరువు నష్టం దావాలు ఇప్పుడు అన్ని పార్టీలకు పాకింది. ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పాలిగానీ, ఇలా పిటిషన్లు వేసుకుంటూ పోతే వాటికి అంతెక్కడ అన్న ప్రశ్న తెలుత్తుతోంది.