Kodi Kathi Case: హ్యాపీ కోడి కత్తి డే.. వైఎస్ జగన్ కు వినూత్న శుభాకాంక్షలు!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎన్నో రకాల కేసులు మరుగున పడిపోయాయి. అందులో కోడి కత్తి కేసు ఒకటి. ఆరేళ్ల కిందట జరిగిన ఈ కేసులో ఒక్క అడుగు పురోగతి లేకపోవడం విశేషం.

Written By: Dharma, Updated On : October 25, 2024 6:24 pm

Kodi Kathi Case

Follow us on

Kodi Kathi Case: ఏపీలో కోడి కత్తి కేసు పెను ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో నాటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. దీంతో వైసీపీకి ఇది ప్రచార అస్త్రంగా మారింది. ఆ ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాన అంశంగా మారిపోయింది. అయితే గత ఐదేళ్లలో ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. కేసులో కుట్ర కోణం ఉందని.. మరింత లోతైన దర్యాప్తు కావాలని జగన్ కోరారు. అయితే దాడి జరిగింది విమానాశ్రయంలో కాబట్టి.. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలోకి చేరింది. అయితే ఈ దాడి విషయంలో ఎటువంటి కుట్ర కోణం లేదని.. కేవలం జగన్ కు ఎన్నికల్లో సానుభూతి రావాలని.. ఆయన అభిమాని అయిన కోడి కత్తి శ్రీనివాస్ ఈ దాడి చేసినట్లు తేల్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అయితే కేసు విచారణకు జగన్ హాజరు కాలేదు. సీఎం హోదాలో బిజీగా ఉండడంతో తాను హాజరు కాలేనని మినహాయింపు కోరారు జగన్. అయితే ఒక కేసులో నిందితుడు రిమాండ్ ఖైదీగా ఐదేళ్లపాటు కొనసాగడం దేశ చరిత్రలోనే లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో నిందితులు కోడి కత్తి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. దాదాపు ఐదున్నర సంవత్సరాలుగా రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సి వచ్చింది నిందితుడు. కోడి కత్తి దాడి 2018 అక్టోబర్ 25న జరిగింది. దానిని గుర్తు చేస్తూ టిడిపి సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేసింది. ఒకటి కోడి కత్తిదాడి, రెండు ఆసుపత్రిలో జగన్ పడుకున్న ఫోటోను జతచేసి.. వ్యంగ్యంగా పోస్ట్ చేసింది టిడిపి.

* పాదయాత్ర నుంచి వెళుతుండగా
జగన్ విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. 2018లో ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వారంలో రెండు రోజులపాటు తన పాదయాత్రకు విరామం ఇచ్చేవారు. హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు విచారణకు హాజరయ్యేవారు. 2018 అక్టోబర్ 25న విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని జగన్ హైదరాబాద్ బయలుదేరారు. విశాఖ విమానాశ్రయంలో వెళ్తుండగా కోడి కత్తితో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేశాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలన అంశంగా మారిపోయింది. నాటి టిడిపి ప్రభుత్వమే ఈ దాడి చేయించిందని వైసీపీ ఆరోపణలు చేసింది. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చింది. సీన్ కట్ చేస్తే గత ఆరు సంవత్సరాలుగా ఈ కేసులో అడుగు కూడా ముందుకు పడలేదు.

* ఆరేళ్లుగా నో బెయిల్
ఈ కేసులో నిందితుడికి అసలు బెయిల్ లభించలేదు.తాను ఈ రాష్ట్రానికి సీఎంనని.. పని ఒత్తిడిలో బిజీగా ఉన్నందున కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుకున్నారు. అయితే నిందితుడికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. జగన్ పై అభిమానంతో ఆ పని చేశానని నిందితుడు స్వయంగా చెప్పినా సీఎం జగన్ మనసు కరగలేదు. ఆయన కుటుంబ సభ్యులు కలవాలని ప్రయత్నించినా.. కలిసేందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో జగన్ ఉన్నా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అయితే యాదృచ్ఛికంగా ఈరోజుకు ఆ ఘటన జరిగి ఆరేళ్లవుతోంది. దానిని గుర్తు చేస్తూ టిడిపి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. హ్యాపీ కోడి కత్తి డే అంటూ వైయస్ జగన్కు శుభాకాంక్షలు వెలువెత్తుతుండడం విశేషం.