HomeతెలంగాణAdluri vs Ponnam: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ 6 నిమిషాల వీడియో.. 'దున్నపోతు' అన్న పొన్నం...

Adluri vs Ponnam: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ 6 నిమిషాల వీడియో.. ‘దున్నపోతు’ అన్న పొన్నం సారీ చెప్పాల్సిందే

Adluri vs Ponnam: తెలంగాణ మంత్రి పొన్న ప్రభాకర్‌ చేసిన ‘దున్నపోతు’ వ్యాఖ.. పెద్ద దుమారమే రేపుతోంది.. చినికి చినికి తుఫాన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. మొదట ఈ వ్యాఖ్య గురించి మాజీ మంత్రి, దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బాధిత మంత్రి కూడా స్పందించారు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ 6 నిమిషాల వీడియో విడుదల చేశాడు. లేదంటే జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని పరోక్షంగా పొన్నందను హెచ్చరించారు. దీంతో వివాదం ముదురుతోంది.

ఏం జరిగిందటే..
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి హాజరయ్యారు. సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాత్రం ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే సమావేశంలో అరగంట వేచి ఉన్న మంత్రులు.. లక్ష్మణ్‌కుమార్‌ వస్తాడా.. తర్వాత జాయిన్‌ అవుతాడా అడగాలని మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌కు సూచించారు. ఈ సందర్భంగా అందరూ చూస్తుండగానే పొన్నం ప్రభాకర్‌ దున్నపోతు అని వివేక్‌తో వ్యాఖ్యానించారు. దీనికి సబంధించిన వీడియో వైరల్‌ కావడంతో వివాదం పెద్దదిగా మారింది.

క్షమాపణ కోరిన లక్ష్మణ..
తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై ఆడ్లూరి లక్ష్మణ 6 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఎదుర్కొన్న వ్యక్తిగత అవమానాన్ని, తన మనసులో కలిగిన బాధను వివరించారు. సహచరుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమని, అవి తన గౌరవానికి భంగం కలిగించాయని స్పష్టంగా తెలిపారు. సార్వజనిక వేదికలో తనపై చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రబాకర్‌ క్షమాపణ చెప్పాలని లక్ష్మణ డిమాండ్‌ చేశారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు వ్యక్తిగత దూషణలకు దారితీయరాదని, కాంగ్రెస్‌ పార్టీ మాదిరి పెద్ద వేదికపై ఇటువంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు.

వివేక్‌పై ఆరోపణలు..
ఇదే సమయంలో లక్ష్మణ్‌ మరో సహచర మంత్రి వివేక్‌ వెంకటస్వామిపై ఆరోపణలు చేశారు. వివేక్‌ తనను ఓర్వడం లేదని పేర్కొన్నారు. తాను పక్కన కూర్చోవడం ఇష్టంలేకనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మాదిగ అయిన తాను మంత్రి కావడాన్ని వివేక్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. అందుకే పొన్నం ప్రభాకర్‌ తనను దున్నపోతు అన్నా ఖండించలేదని తెలిపారు.

పార్టీలో అంతర్గత ప్రభావం
ఈ ఘటనతో కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉపఎన్నికల సమయంలో పార్టీ లోపల ఇలాంటి కామెంట్లు రావడం, ప్రచార వ్యూహాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. సామాజిక వర్గాలలో ఈ వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎస్సీ వర్గాలు, మద్దతుదారులు, రాజకీయ విశ్లేషకులు ఈ ఘటనను గౌరవ సమస్యగా భావిస్తున్నారు. ఇది నివారించకుంటే పార్టీ ప్రతిష్ఠపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular