Spiritual solution: ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా భయం ఇచ్చేది మరణం. మరణించే కొన్ని క్షణాల ముందు ఆ భయం నరకంలా ఉంటుంది. తాను చనిపోతున్నాను అని ముందే తెలిస్తే అంతకుమించిన బాధ ప్రపంచంలో మరొకటి ఉండదు. అయితే చాలామంది ప్రతి చిన్న విషయంలో తమకు మరణం వస్తుందేమోనన్నా ఆందోళనతో ఉంటున్నారు. తమ జీవితం ఇక అయిపోయిందని.. మరణం ఆసన్నమైందని ఎవరికి వారే భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి భయం పోగొట్టడానికి ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి వారే భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ భయం పోవాలంటే ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి. అది ఏ నామం అంటే?
సృష్టికర్త బ్రహ్మ అయితే.. జీవితాన్ని నడిపించే దేవుడు విష్ణువు అని అంటారు. శివుడుని లయకారకుడిగా పేర్కొంటారు. అంటే ఒక వ్యక్తి మరణం అంశం శివుడి చేతిలో ఉందని పురాణాలు చెబుతూ ఉంటాయి. అందుకే శివుడిని మృత్యుంజయుడు అని పిలుస్తారు. అకాల మృత్యువు ఉన్నవారు శివ భక్తుడిగా మారి.. నిత్యం శివుడిని జపిస్తే దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఉదాహరణగా మార్కండేయ పురాణం ను పేర్కొనవచ్చు.
ఒక గ్రామంలో దంపతులు నిత్యం శివుడిని పూజిస్తూ ఉండేవారు. దీంతో శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోవాలని అడుగుతాడు. తమకు సంతానం కావాలని అడగగా.. కుమారుడు పుడతాడని చెబుతాడు. అయితే తమ కుమారుడు జ్ఞానవంతుడు అయి ఉండాలని కోరుకోగా సరే అంటాడు. దీంతో వారికి మార్కండేయుడు జన్మిస్తాడు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగానే మార్కండేయుడు ఎంతో భక్తి, జ్ఞానం కలిగి ఉంటాడు. అయితే మార్కండేయుడి ఆయుషు 16 సంవత్సరాలు మాత్రమే. ఈ సమయం రాగానే యముడు వచ్చి మార్కండేయుడు పై పాశం విసురుతాడు. కానీ మార్కండేయుడు మాత్రం శివలింగాన్ని పట్టుకొని శివ నామం జపిస్తూ ఉంటాడు. యువ ధర్మరాజు వేసిన పాశం శివలింగంపై పడగా శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడని కాపాడుతాడు. అంటే అంతటి యముడే ఎదురుగా వచ్చినా కూడా మార్కండేయుడు కేవలం శివ నామాన్ని జపిస్తూ ఉంటాడు. దీంతో మార్కండేయుడికి దీర్ఘాయుష్షు కలుగుతుంది.
ఇలా మనుషులు కూడా ఎవరైనా నిత్యం శివనామం జపించడం వల్ల అకాల మృత్యువు నుంచి తప్పించుకునే మార్గం ఉంటుంది. అలాగే మరణ భయం నుంచి బయట పడాలంటే ప్రతి రోజు 108 సార్లు ఓం నమశ్శివాయ అనే నామాన్ని జపించాలి. అలా చేయడంవల్ల మరణ భయం అనేది తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి. రాత్రి పడుకునే ముందు శివుడుని స్మరిస్తూ ఉండాలి. ఇలా నిత్యం శివ పూజలో ఉన్నవారు మరణ భయం నుంచి బయటపడతారు. అలాగే అకాల మృత్యువు నుంచి తప్పించుకునే మార్గం ఉంటుంది.