Srikanth Iyengar comments: ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్. ఈయన్ని శ్రీ భారత్ అని కూడా పిలుస్తుంటారు. మంచి నటుడే, కానీ ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తన మనసులో ఉన్న ఆలోచనలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా బయట చెప్పడం మంచిదే. కానీ ఈయన చేసే కొన్ని వ్యాఖ్యలు యువత ని తప్పు దోవ పట్టించేలా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని ఈయన చేసే కామెంట్స్ పెను దుమారం రేపుతుంటాయి. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా ఇతను గాంధీ పై చేసిన వివాదాస్పద కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దీనికి కౌంటర్ ఇస్తూ నిన్న రాత్రి ఈయన మరో వీడియో విడుదల చేశారు. ఈ వీడియో లో ఆయన గాంధీ పై మరింత నోరు పారేసుకున్నాడు. ఆయన ఏమి మాట్లాడాడంటే ‘నేను ఏ చిన్న పోస్ట్ పెట్టినా కామెంట్స్ వస్తూనే ఉంటాయి, దానిని నేను పెద్దగా పట్టించుకోను. మొన్న అక్టోబర్ 2 నేను పెట్టిన పోస్ట్ కి తెగ చించుకున్నారు. అసలు ఏమి తెలుసు రా మీకు?..15,16 ఏళ్ళ అమ్మాయిని, ఈయన పక్కన నగ్నంగా పడుకోబెట్టి, నిగ్రహంగా ఉన్నానా లేదా అని చూసుకున్నాడు. ఎంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఈయన మహాత్ముడా?, ఆత్ముడు. స్వాతంత్రం ఈయన తీసుకొచ్చాడా?, ఆయన తెచ్చింది ఏందీ బొక్కా?, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారు తీసుకొచ్చారు. ఎన్నో వేల మంది ప్రాణ త్యాగాలు చేస్తే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈయన జాతి పితనా?, ఒక్కటే చెప్తా వినండి, మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే, నేను బాస్టర్డ్ అని ఒప్పుకుంటున్నాను’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసాడు.
మధ్యలో ఆయన కొన్ని బూతులు కూడా వాడాడు. గాంధీ పై ఇంత దారుణంగా మాట్లాడిన సెలబ్రిటీ ఇండియా లోనే లేడు. గాంధీ తాత బొమ్మని ముద్రించిన పచ్చ నోటు లేనిదే మనకు జీవితం గడవదు. అలాంటి మహోన్నత వ్యక్తి పై ఇలాంటి కామెంట్స్ చేసి, శ్రీకాంత్ ఇంకా అరెస్ట్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు కాబట్టే, ఈయనకు సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు ఏడాదికి కనీసం పది సినిమాలు చేసేవాడు. ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం లో కనిపించాడు, కానీ ఆ సినిమా మూడేళ్ళ క్రితం మొదలైంది. అప్పటికి ఆయన గొప్ప స్థాయిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
Dare to WATCH?!?!?!
THE TRUTH!!!!!!! pic.twitter.com/0Y0kO2cvDP
— Shrikanth BHARAT (@Shri__Bharat) October 6, 2025