https://oktelugu.com/

టీ.కాంగ్రెస్ ఇన్ చార్జిగా యువనేత.. రేవంత్ కు లైన్ క్లియరా?

జాతీయ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తెలంగాణ కాంగ్రెస్ కు ఆయాచిత వరమైంది. పీసీసీ చీఫ్ గా తప్పుకున్నా.. ఇంకా ఉత్తమ్ నే అధిష్టానం కొనసాగిస్తోంది. ఆయన రాజీనామా చేసినా ఇంకా నాన్చుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీఆజాద్, ఖర్గే తోపాటు 23 మంది సీనియర్లు సోనియాకు లేఖ రాసి కాంగ్రెస్ ను కుదుపు కుదిపేశారు. Also Read: తెలుగు మీడియా హౌజ్‌లోకి మరో చానల్‌ దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా కాంగ్రెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 10:28 am
    Follow us on

    జాతీయ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తెలంగాణ కాంగ్రెస్ కు ఆయాచిత వరమైంది. పీసీసీ చీఫ్ గా తప్పుకున్నా.. ఇంకా ఉత్తమ్ నే అధిష్టానం కొనసాగిస్తోంది. ఆయన రాజీనామా చేసినా ఇంకా నాన్చుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీఆజాద్, ఖర్గే తోపాటు 23 మంది సీనియర్లు సోనియాకు లేఖ రాసి కాంగ్రెస్ ను కుదుపు కుదిపేశారు.

    Also Read: తెలుగు మీడియా హౌజ్‌లోకి మరో చానల్‌

    దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా కాంగ్రెస్ లోని అసమ్మతులను ఏరేసింది. గులాం నబీ ఆజాద్ సహా, ఖర్గేతోపాటు సీనియర్లకు మంగళం పాడేసింది. పార్టీలోకి యువ మంత్రం ఎక్కించింది. రాహుల్ టీంకు పెద్దపీట వేసింది.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిని కూడా మార్చేశారు. ప్రస్తుత ఇన్ చార్జి కుంతియాను పక్కనపెట్టారు. తమిళనాడుకు చెందిన యంగ్ డైనమిక్ ఎంపీ మణికం ఠాగూర్ (45)ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు..

    మణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్.యూ.ఐ నుంచి మణికం ఠాగూర్ అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్.యూ.ఐ ఆల్ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా.. సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ గా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.రాహుల్ కు నమ్మిన బంటు. పైగా యువకుడు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపడుతారు.

    రాహుల్ టీంలో భాగంగానే ఠాగూర్ నియామకం అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే మణికం పార్టీ సీనియర్లు, జిల్లాల అధ్యక్షులతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ యువనేతలకు ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది.

    Also Read: తెలంగాణలో నూతన శకం ఆరంభం

    ఇక తెలంగాణకు కొత్త ఇన్ చార్జి నియామకంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడున్న చర్చ మొదలైంది.  మణికం ఠాగూర్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నాక ఏఐసీసీకి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మాణికం నియామకంతో యువకుడైన రేవంత్ రెడ్డి మార్గం క్లియర్ అయినట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.