Also Read: ఏపీలో మరో ‘విషపు’ లీకేజీ.. ఏమిటీ ఉపద్రవాలు?
విశాఖ జిల్లాకు చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో వ్యాపారాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నూతన్‌నాయుడితో వీరికి స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని నూతన్‌నాయుడు ఎస్‌బీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారిని నమ్మించాడు. ఇందుకోసం శ్రీకాంత్ రెడ్డి రూ.12 కోట్లు, నూకరాజు రూ.5 లక్షలు ఇచ్చినట్లు బాధితులు అంటున్నారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి వారు పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క ఉద్యోగం కోసం నూతన్‌నాయుడు రూ.12 కోట్లు తీసుకున్నాడా లేడా.. శ్రీకాంత్‌రెడ్డి వాటిని ఇచ్చాడా లేడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నూతన్‌నాయుడికి సన్నిహితంగా ఉన్న శశికాంత్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: జగన్ కాంప్రమైజ్ కాకపోతే ఏపీ మునిగినట్టే?
మరోవైపు ఇప్పటికే దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియతోపాటు ఏడుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కేసు నుంచి తన భార్య మధుప్రియను తప్పించేందుకు నూతన్ నాయుడి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేశ్ పేరిట పలువురు ఆఫీసర్లకు ఫోన్ చేయించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుల్లో నూతన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. ఇప్పుడు అతడిపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి.