కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచం మొత్తాన్ని ట్వంటీ ట్వంటీ ఆడుతుండగా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్యాస్ లీకేజీ ప్రమాదాలు చుట్టుముడుతున్నాయి. అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. కొద్ది కాలం క్రితం విశాఖపట్నంలోని LG పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటన కలకలం రేపింది. ఆ ప్రమాదంలో 11 మంది వరకు చనిపోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు.
Also Read: జగన్ కాంప్రమైజ్ కాకపోతే ఏపీ మునిగినట్టే?
ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో గ్యాస్ లీకైంది. జిల్లాలోని పూతలపట్టు మండలంలోని బందపల్లి హాట్సన్ డైరీ లో అమోనియా గ్యాస్ లీకేజీ జరిగింది. గ్యాస్ ప్రభావంతో 12 మందికి పైగా స్పృహ కోల్పోగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఇప్పుడు తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో విష వాయువు లీకేజీ కలకలం రేపింది. కాకినాడ ఆటోనగర్‌లో శుక్రవారం తీవ్ర దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరికొందరు భయపడి పరుగులు తీశారు. సమీపంలోని లారీ డ్రైవర్లు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, పరిశ్రమల శాఖ అధికారులు దుర్వాసన వచ్చిన చోటుకి వచ్చారు. నమూనాలను ల్యాబ్‌కి పంపించగా.. దానిని ప్రాథమికంగా అమోనియాగా గుర్తించారు. ఆ వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఘటన స్థలంలో నీరు చల్లడంతో వాయువు వాసన తీవ్రత తగ్గింది.
Also Read: బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల చొప్పున, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, రెండు మూడు రోజులు చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి అండగా నిలిచారు. కానీ.. రాష్ట్రంలో ఈ వరుస గ్యాస్ లీకేజీ ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు. ఏమూలన నుంచి ఏ ప్రమాదం దూసుకొస్తుందోనని భయపడుతున్నారు.