spot_img
Homeటాప్ స్టోరీస్Mallareddy Dance Video: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు...

Mallareddy Dance Video: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

Mallareddy Dance Video: కొందరికి ఏజ్ పెరుగుతుంటే రకరకాల వ్యాధులు వస్తుంటాయి. మరికొందరికి ఏమో ఏజ్ పెరుగుతుంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. పైగా యుక్త వయసులో ఉన్నప్పుడు చేయలేని పనులను ఈ ఏజ్ లో చేస్తుంటారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి అలియాస్ పాల మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు.

Also Read: తణుకులో ‘తానా’ రైతు సేవా యజ్ఞం – 1000 మంది రైతులకు రూ. 25 లక్షల విలువైన పరికరాల పంపిణీ

పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ, సక్సెస్ ఐన.. అని అప్పట్లో మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ఇక అప్పటినుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సరే.. ఏం చేసినా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. వాస్తవానికి మల్లారెడ్డి వయసు ఇప్పుడు ఏడు పదులు దాటింది. అయినప్పటికీ ఆయన యంగ్ గా కనిపిస్తున్నారు. ఉత్సాహానికి ప్రతీకగా దర్శనమిస్తున్నారు.

మల్లారెడ్డి తన 50వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వహించిన సంగీత్ వేడుకలో మల్లారెడ్డి అదరగొట్టారు. హుక్ స్టెప్పులతో అలరించారు. వయసు అనేది శరీరానికి మాత్రమేనని.. మనసుకు కాదని ఆయన నిరూపించారు. షేర్వాని ధరించి.. మెడలో గులాబీ కండువా వేసుకొని.. కళ్ళకు గాగుల్స్ తో అచ్చం మాస్ హీరో లాగా కనిపించారు మల్లారెడ్డి.

మల్లారెడ్డి వేసిన స్టెప్పుల సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. “ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు. కానీ మల్లారెడ్డి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయనకు అన్ని సహకరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారమవుతోంది. దేశవ్యాప్తంగా తన విద్యాసంస్థలను విస్తరిస్తున్నారు మల్లారెడ్డి. అంతటితోనే ఆగడం లేదు. 70 సంవత్సరాల వయసులో కూడా యువకుడి లాగా రెచ్చిపోతున్నారు. ఇది మామూలు విషయం కాదంటూ” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular